-
హైదరాబాద్ టూ రాజమండ్రి.. ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించనున్న సంస్థ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్ తన సేవలను ఫిబ్రవరి 23 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. వివిధ పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి 5 నుండి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్–విద్యానగర్–హైదరాబాద్, విద్యానగర్–బెంగళూరు–విద్యానగర్, బెంగళూరు–బీదర్–బెంగళూరు, హైదరాబాద్–రాజమండ్రి–హైదరాబాద్, హైదరాబాద్–నాందేడ్–హైదరాబాద్, ముంబై–నాందేడ్–ముంబై, ముంబై–కొల్హాపూర్–ముంబై, ముంబై–జల్గావ్–ముంబై రూట్లలో సర్వీసులు ఉంటాయని ట్రూజెట్ ఎండీ వి.ఉమేశ్ సోమవారం వెల్లడించారు. -
రామ్ చరణ్ 'ట్రూజెట్'పై ఫిర్యాదులు
హైదరాబాద్: ప్రముఖ హీరో రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న 'ట్రూజెట్' విమాన సర్వీసులపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ ఆంగ్ల పత్రిక ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నివేదిక ప్రకారం ఆగస్టులో 5 శాతం కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసిన విమాన సంస్థల్లో ఎయిర్ పెగాసస్, ట్రూజెట్ టాప్‌లో ఉన్నాయి. ఇక ప్రయాణకుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా ట్రూజెట్ పైనే ఎక్కువగా ఉన్నాయి. గురువారం రాత్రి ట్రూజెట్ ఫ్లయిట్ 2T 106 ఔరంగాబాద్-హైదరాబాద్-తిరుపతి సర్వీసును హైదరాబాద్ వచ్చిన తర్వాత రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. 'ఈ విమానం ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్లాల్సివుంది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చింది. పార్కింగ్ బే వద్ద ప్రయాణికులు నిరసన వ్యక్తం చేసి మరో విమానం ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే కొన్ని సమస్యల వల్ల విమానాన్ని ఏర్పాటు చేయలేకపోయారు' అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకుని ప్రయాణికులను పార్కింగ్ బే నుంచి ఎయిర్ పోర్ట్ లాంజ్‌లోకి తీసుకెళ్లారని చెప్పారు. లాంజ్‌లో కూడా ప్రయాణికులు ఆందోళన కొనసాగించడంతో వారిని హోటల్స్‌కు తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రయాణికులు తిరుమలలో పూజా టికెట్లు బుక్ చేసుకోవడంతో ఆందోళన చెందారని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement