-
ఆమెను కలుసుకోవాలని ఉంది: శ్రేయా
ముంబై: తన అద్భుత గాత్రంతో యూట్యూబ్ సహా సోషల్ మీడియా అంతటా సంచలనం సృష్టిస్తోన్న అంధ విద్యార్థిని తుంపా కుమారికి ఓ విశిష్ట వ్యక్తి నుంచి పిలుపొచ్చింది. 'ఆశికీ- 2' సినిమాలో తాను పాడిన 'సున్ రహా..' పాటను తన కంటే అందంగా ఆలపించిందంటూ గాయని శ్రేయా ఘోషాల్ బాలికకు కితాబిచ్చింది. అంతేకాదు.. 'ఆమె ఎవరు? ఎక్కడుంటుంది? తొందరగా కలుసుకోవాలని ఉంది..' అంటూ ఫేస్బుక్ ద్వారా ఆహ్వానం పలికింది. జార్ఖండ్‌లోని బ్రజ్కిశోర్ అంధుల పాఠశాలలో చదువుతున్న తుంపా కుమారి అనే ఈ చిన్నారి.. బాలీవుడ్ సింగర్లందరూ అచ్చెరువొందేలా పాడిన పాట నెట్లో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పాటలోని ఆరోహణ.. అవరోహణలను అవలీలగా ఆమె పాడిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలోని గమకాలను అలవోకగా ఆమె ఆలపించింది. సినిమాలో శ్రేయాఘోషల్ పాడిన ఈ పాటను చిన్న బాలిక పాడటం చూసి నెట్ ప్రపంచం ఆమెకు జోహార్లంటోంది. ఎవరైనా సంగీత దర్శకుల దృష్టికి ఈమె టాలెంట్ వెళ్తే మాత్రం.. తిరుగులేకుండా ఆమె దేశం గర్వించదగ్గ గాయని అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల్లో కూడా 'మీరు చేస్తున్న పని తక్షణం ఆపేసి.. ఈ వీడియో చూడండి. ఈ పాప పాడిన పాట చూస్తే, బాలీవుడ్ సింగర్లంతా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే' అన్న సందేశంతో పాటుఈ వీడియో షేర్ అవుతోంది. -
ఈ పాట వింటే.. సింగర్లు చిన్నబోవాల్సిందే
టాలెంట్ ఎక్కడ ఎలా దాగి ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎవరైనా గుర్తించి.. దాన్ని వెలికి తీసేవరకు ఆ నిప్పునకు నివురు కప్పే ఉంటుంది. జార్ఖండ్‌లోని బ్రజ్కిశోర్ అంధుల పాఠశాలలో చదువుతున్న తుంపా కుమారి అనే ఈ చిన్నారి.. బాలీవుడ్ సింగర్లందరినీ తలదన్నే టాలెంటును ప్రదర్శించింది. ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా అంతటా ఈమె వీడియో హల్చల్ సృష్టిస్తోంది. 2013 సంవత్సరంలో విడుదలైన సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ లవ్ స్టోరీ 'ఆషికీ 2' సినిమాలోని టాప్ సాంగ్ 'సున్ రహా హై నా తూ' పాటను.. ఆమె అత్యంత అద్భుతంగా పాడింది. ముఖ్యంగా ఈ పాటలోని ఆరోహణ.. అవరోహణలను అవలీలగా ఆమె పాడిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలోని గమకాలను అలవోకగా ఆమె ఆలపించింది. సినిమాలో శ్రేయాఘోషల్ పాడిన ఈ పాటను చిన్న బాలిక పాడటం చూసి నెట్ ప్రపంచం ఆమెకు జోహార్లంటోంది. ఎవరైనా సంగీత దర్శకుల దృష్టికి ఈమె టాలెంట్ వెళ్తే మాత్రం.. తిరుగులేకుండా ఆమె దేశం గర్వించదగ్గ గాయని అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల్లో కూడా 'మీరు చేస్తున్న పని తక్షణం ఆపేసి.. ఈ వీడియో చూడండి. ఈ పాప పాడిన పాట చూస్తే, బాలీవుడ్ సింగర్లంతా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే' అన్న సందేశంతో పాటుఈ వీడియో షేర్ అవుతోంది. మరి ఆలస్యం ఎందుకు.. మీరు కూడా ఈ పాట చూడండి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement