-
Hyderabad: టీచర్ కర్కశత్వం.. పసి ప్రాణం బలి
ఉప్పల్(హైదరాబాద్): ఓ టీచర్ కర్కశత్వం పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంకా బలపమే సరిగా పట్టుకోలేని చిన్నారిపై టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. హోంవర్క్ చేయలేదంటూ పలకతో తలపై బలంగా కొట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి.. టీచర్ కొట్టిన దెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ వివేక్ నగర్లో స్ట్రీట్ నెంబర్10 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ విద్యార్థిని టీచర్ తలపై బలంగా కొట్టాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలుకతో కొట్టడం తో స్పృహ తప్పి పడిపోయాడు అభం శుభం తెలియని చిన్నారి. దాంతో ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఈ రోజు ఉదయం చనిపోయాడు. చనిపోయిన అబ్బాయి మృతదేహాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర ఉంచి తల్లిదండ్రులు, బంధువులు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు -
పోలీస్‌స్టేషన్‌కు యూకేజీ పిల్లోడు.. ‘మీరంతా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయండి’
పలమనేరు: తమ పాఠశాల వద్ద జేసీబీ, ఇతర వాహనాలను అడ్డుగా నిలపడంతో స్కూల్ బస్సులు ఆపాలన్నా, బడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ వల్ల ఇబ్బందిగా ఉందని ఓ యూకేజీ పిల్లోడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో యూకేజీ చదువుతున్న కార్తికేయ (06) నిత్యం బడి వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తడాన్ని గమనించాడు. ఈ సమస్య తీరాలంటే ఎవరితో చెప్పాలని తన తండ్రిని అడగ్గా పోలీసులకు చెప్పాలంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో శనివారం ఉదయం కార్తికేయ పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం నాన్నా.. అంటూ మారాం చేయడంతో తండ్రి స్టేషన్ వద్దకు తీసుకెళ్లాడు. వెంటనే లోనికెళ్లిన బుడతడు సీఐ భాస్కర్ వద్దకెళ్లి.. వెంటనే మీరంతా వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయండి అంటూ బుడిబుడిమాటలతో ధైర్యంగా అడిగాడు. ఓ కానిస్టేబుల్‌ను పంపుతామని సీఐ చెప్పడంతో వద్దు సార్.. మీరే రావాలని పట్టుబట్టాడు. ఆ పిల్లాడి ధైర్యానికి సంబరపడిపోయిన సీఐ ఓ మిఠాయి తినిపించి అభినందించాడు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు ఫోన్ చేయమంటూ సీఐ మాటవరసకు చెప్పగా.. ఆ బుడతడు వెంటనే ‘ఫోన్ నంబర్ ఇస్తే కదా’ అనడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. తర్వాత సీఐ ఓ పేపర్‌పై తన సెల్ నెంబరు రాసిచ్చి పంపాడు. అనంతరం ఓ కానిస్టేబుల్‌ను పంపి స్కూల్ వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉంచారు. దీన్నంతా సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడా వీడియో నెట్టింట హల్చల్ సృష్టిస్తోంది. -
యూకెజీ బాలుడిని చితకబాదిన టీచర్ సునీత
-
స్కూల్ బస్సు కింద పడి బాలుని మృతి
చింతలపూడి : చింతలపూడి మండలం, మేడిశెట్టివారిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఆరు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేడిశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన చెన్ను పవ¯ŒS(6) సీతానగరం అమృత వర్షం స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. శుక్రవారం స్కూల్ బస్సులో ఇంటికి బయలు దేరాడు. గ్రామంలోని ఇంటికి సమీపంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తూ అదే బస్సు టైర్ల క్రింద పడ్డాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే కన్నకొడుకు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్సై సైదానాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
బస్సు కింద పడి చిన్నారి మృతి
ధర్మారం (నిజామాబాద్): స్కూల్ బస్సు నుంచి దిగిన విద్యార్థి ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం-బీ గ్రామంలోని ముదిరాజ్ వీధిలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన బత్తెల మహేష్ (5) సెయింట్ జోసఫ్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా స్కూల్ బస్సులో ఇంటి వద్ద దిగాడు. బస్సుకి క్లీనర్ లేకపోవడంతో డ్రైవర్ చూసుకోకుండా నడపడంతో బాలుడు బస్సు వెనుక టైర్ల కిందపడి అక్కడికక్కడి మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కొమురెల్లి, శిరీషలు కన్నీరుమున్నీరయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement