-
23ఏళ్ల విషాద ఘటన.. శిక్షను పొడిగించలేం!
న్యూఢిల్లీ: 23ఏళ్ల క్రితం దేశ రాజధానిలోని ఉపహార్ థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. థియేటర్ యజమానులకు విధించిన శిక్షను పొడిగించాలని కోరుతూ బాధితులు వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు కొట్టేసింది. 1997 సంవత్సరం గ్రీన్ పార్క్ సమీపంలో ఉపహార్ థియేటర్లో సినిమా ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అనూహ్య ఘటనలో 59మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనలో థియేటర్ యాజమానులైన గోపాల్ అన్సల్, సుశీల్ అన్సల్‌లపై కేసు నమోదైంది. 2007లో వీరిని విచారించిన ట్రయల్ కోర్టు దోషులుగా ప్రకటించి రేండేళ్ల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అన్సల్ సోదరులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్ష ఏడాదికి తగ్గించబడింది. కాగా, ఈ శిక్షను నిందితులు సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. 60కోట్లు చెల్లిస్తే సరిపోతుందని, జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. అయితే వయసు దృష్ట్యా సుశీల్ బన్సాల్‌కు జైలు శిక్ష నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. సుప్రీం తీర్పుపై భాదితుల సంఘం మరోసారి క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయగా.. నిందితులకు శిక్షను మరింత కాలం పొడగించలేమని, ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది. చదవండి: నిర్భయకు న్యాయం జరగకుంటే.. -
శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి
ఉపహార్ కేసులో అన్సాల్ సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాదం కేసులో బాధిత కుటుంబాలకు సుప్రీం కోర్టు నిరాశ మిగిల్చింది. ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన హాలు యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌లు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే వారు చెరో రూ. 30 కోట్లను మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా కింద జమ చేయాలని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వాడాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలోని ఉపహార్ హాల్లో 1997, జూన్ 13న ‘బోర్డర్’ సినిమా ప్రదర్శిస్తుండగా భారీ అగ్నిప్రమాదం జరిగి 59 మంది సజీవదహనం అయ్యారు. అన్సాల్ సోదరులకు ఢిల్లీ కోర్టు ఏడాది జైలు శిక్ష వేసింది. విచిత్రమేమంటే వీరిలో ఒకరు అయిదు నెలలు, మరొకరు నాలుగు నెలలు మాత్రమే కేసు ప్రాథమిక విచారణ దశలో జైల్లో ఉండి వచ్చారు. ఇప్పుడు వారి అప్పీలుపై సుప్రీం ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశ కలిగించిందని బాధితుల పక్షాన 18ఏళ్లుగా పోరాడుతున్న నీలం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయాన్ని ఈ తీర్పు కలిగించిందన్నారు. న్యాయం కోసం సుప్రీంకు రావడం తమ పొరపాటన్నారు. డబ్బున్న వ్యక్తి ఎవరినైనా కారు కింద పడేసి చంపి కోటి రూపాయలు ఇస్తే చాలన్నట్లుగా కోర్టు తీర్పు ఉందన్నారు. న్యాయం కోసం ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న తమ ఆవేదనను కోర్టు పట్టించుకోలేద న్నారు. ఇటువంటి కేసులలో చట్టం ప్రకారం గరిష్ట శిక్ష రెండేళ్లే అయినా తమ నిర్లక్ష్యంతో 59 మందిప్రాణాలను బలిగొనడానికి కారణమైనవారికి మరింత కఠిన శిక్ష విధించి కోర్టు కొత్త దారి చూపి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఉపహార్ ఘటనలో కృష్ణమూర్తి దంపతులు తమ ఇద్దరు పిల్లలను కోల్పోయారు. అప్పటి నుంచి నీలం న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. అసోసియేషన్ ఆప్ విక్టిమ్స్ ఆఫ్ ఉపహార్ ట్రాజెడీగా ఏర్పడి ఇన్నేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
ఆప్తులను స్మరించుకున్న ‘ఉపహార్’ బాధితులు
న్యూఢిల్లీ: ఉపహార్ అగ్ని ప్రమాదంలో మరణించిన 59 మందిని స్మరించుకుంటూ బాధిత కుటుంబాలు శుక్రవారం ఇక్కడ ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. పదిహేడేళ్ల క్రితం ఉపహార్ సినిమా థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించిన సంగతి తెల్సిందే. ఇటువంటి మానవ తప్పిదాల కారణంగా జరిగే ప్రమాదాలలో దోషులను శిక్షించేందుకు ఓ పటిష్టమైన చట్టాన్ని అమలు చేయాలని బాధిత కుటుంబాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి. ఉపహార్ హాలు ఎదురుగా ఉన్న గ్రీన్ పార్కులోని స్మృతి ఉపవన్‌లో బాధిత కుటుంబాలు హోమం నిర్వహించాయి. మానవ తప్పిదాల కారణంగా జరిగే విపత్తులపై విచారణ జరిపేందుకు ఓ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఉపహార్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షులు నీలం కృష్ణమూర్తి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జూన్ 13, 1997లో జరిగిన ఆ అగ్నిప్రమాదంలో నీలం తన ఇద్దరు పిల్లలను కోల్పోయారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 19, 2009లో థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్, ఢిల్లీ అగ్ని మాపక శాఖ సిబ్బంది హెచ్ఎస్ పన్వర్‌లకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఆ తరువాత ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. అగ్ని ప్రమాదానికి అన్సల్ సోదరులను దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం శిక్ష విధించే విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించారు.దోషులకు శిక్ష విధించే ముందు ధర్మాసనం నాటి విషాద దౌష్ట్యాన్ని పరిగణనలోకి తీసుకోగలదని కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. నేరం తీవ్రతకు తగిన విధంగా శిక్ష ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అన్సల్ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం వ్యాపార అవసరాల కోసం లండన్, న్యూయార్క్ నగరాలను సందర్శించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సత్వరం విచారణ జరపాలన్న గోపాల్ అన్సల్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ అంశాన్ని వచ్చే వారం మరో ధర్మాసనానికి నివేదించాలని న్యాయమూర్తులు జేఎస్ ఖేహర్, సి.నాగప్పన్‌లు అన్సల్‌ను ఆదేశించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
Advertisement