-
వరుస పసిడి పతకాలు.. ఏకైక మహిళా అథ్లెట్‌గా
ఒలింపిక్స్ మహిళల అథ్లెటిక్స్‌లో జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మంగళవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్ రేసులో ఆమె విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ‘స్ప్రింట్’ రేసుల్లో ‘డబుల్’ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఎలైన్ 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెల్చుకుంది. ఫలితంగా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో మాత్రం ఉసేన్ బోల్ట్ (జమైకా) వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు. టోక్యో: ఒలింపిక్స్‌లో స్ప్రింట్ రేసు అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు ఉసేన్ బోల్ట్. అతడు అంతలా స్ప్రింట్ రేసులను తన ప్రదర్శనతో ప్రభావితం చేశాడు. తాజా ఒలింపిక్స్‌లో అటువంటి ప్రదర్శననే జమైకన్ మహిళా స్ప్రింటర్ ఎలైన్ థామ్సన్ హెరా ప్రపంచానికి చేసి చూపింది. ఒకవైపు స్ప్రింట్ రేసుల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జమైకన్ పురుష అథ్లెట్లు విఫలమవుతుంటే... మహిళల విభాగంలో మాత్రం ఎలైన్ అదరగొట్టింది. నాలుగు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆమె మరోసారి మెరిసింది. మంగళవారం జరిగిన 200 మీటర్ల పరుగులోనూ పసిడిని తెచ్చే ప్రదర్శనను చేసింది. 21.53 సెకన్లలో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తద్వారా స్ప్రింట్ (100, 200 మీటర్లు) ఈవెంట్లను క్లీన్ స్వీప్ చేసింది. 2016 ‘రియో’లోనూ థామ్సన్ స్ప్రింట్ ఈవెంట్లను క్లీన్ స్వీప్ చయడం విశేషం. ఇలా రెండు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ 100, 200 మీటర్లలో స్వర్ణాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. క్రిస్టినే ఎమ్‌బోమా (నమీబియా; 21.81 సెకన్లు) రజతం... గాబ్రియేలా థామస్ (అమెరికా; 21.87 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఈ నెల 6న జరిగే మహిళల 4*100 టీమ్ రిలేలోనూ ఎలైన్ థామ్సన్ బరిలోకి దిగనుంది. Elaine Thompson-Herah does it again! It is the double-double for the #JAM sprint queen in 21.53!#Gold women’s 200m Tokyo 2020#Gold women’s 100m Tokyo 2020#Gold women’s 200m Rio 2016#Gold women’s 100m Rio 2016@WorldAthletics | #StrongerTogether | #Tokyo2020 | #Athletics pic.twitter.com/AENA2JzT1X — Olympics (@Olympics) August 3, 2021 -
ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు
వార్సా: వార్సాలోని జాతీయ పుట్ బాల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న100 మీటర్ల పరుగు పందెంలో జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు సాధించాడు. 100 మీటర్ల పరుగు పందాన్ని 9.98 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో 1996లో నమీబియాకు చెందిన ప్రాంకీ ఫెడ్రిక్ నమోదు చేసిన 10.05 సెకన్ల రికార్డును బోల్ట్ తిరగరాశారు. వచ్చేవారం జురీచ్ డైమండ్ లీగ్ లో పాల్గోనేందకు బోల్ట్ సిద్దమవుతున్నాడు. ఎలాంటి గాయాల బారిన పడకుండా వచ్చే సీజన్ ను విజయవంతంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాను. గత కొద్ద సంవత్సరాలుగా గాయాలు నన్ను ఎంతో బాధించాయి అని ఉసేన్ బోల్ట్ అన్నాడు. ఒలంపిక్ క్రీడలల్ఓ 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement