-
వరద ముప్పు..పెరిగిన బ్యారేజీ నీటిమట్టం
సాక్షి, శ్రీకాకుళం : ఒడిషా రాష్ట్రంలోని వంశధార నది పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గొట్టా బ్యారేజీలో ప్రస్తుత నీటి మట్టం 7500 క్యూసెక్కులు ఉండగా, రేపు ఉదయానికి నదిలో సుమారు 25 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం వుందని ఒడిషా అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని 13 మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జిల్లా ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. వరద ముప్పు నేపథ్యంలో గొట్టా బ్యారేజీలోని నీటిని 22 గేట్లు ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
కాంట్రాక్టర్లకు కాసుల పండుగ.. రైతులకు తప్పని ఇక్కట్లు
సాక్షి, సరుబుజ్జిలి(శ్రీకాకుళం): మండల పరిధిలో సుమారు 4500 హెక్టార్ల సాగు భూమిని కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్నారు. అయితే ఈ కాలువ గట్లు సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా రైతులకు కష్టాలు తప్పడం లేదు. వంశధార కుడి ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ విషయమై వంశధార అధికారులకు పలు సమావేశాల్లో అందించిన వినతులు బుట్టదాఖలవుతున్నాయి. గత రెండేళ్లకాలంలో వంశధార కాలువలకు నీరు చెట్టు పథకంలో భాగంగా చేపట్టిన పనుల వలన కాంట్రాక్టర్ల జేబులు నిండాయి తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నాయకులు తూతూమంత్రంగా పనులు నిర్వహించారని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
నాణ్యత‘గాలి’ లో..!
పునరావాస కాలనీల్లో పనుల్లో నిబంధనలకు తిలోదకాలు పనుల్లో నాణ్యతా లోపం పది రోజులకే పెచ్చులూడుతున్న వైనం ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: వంశధార రిజర్వాయర్ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనుల్లో నాణ్యత లోపిస్తోంది. లక్షలాది రూపాయల నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ..కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు జేబులు నింపుకుంటున్నారని పలువుఉ విమర్శిస్తున్నారు. తాయిమాంబాపురం వద్ద హిరమండలం మండలం గార్లపాడు గ్రామానికి చెందిన వంశధార రిజర్వాయర్ నిర్వాసితుల కోసం పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. కాలనీకి రెండు వైపులా ఉన్న యంబరాం, బొత్తాడసింగి రోడ్లను సిమెంట్ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు 62 లక్షలతో పనులు చేపట్టారు. రెండు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనుల్లో ఒక ప్యాకేజీలో 28 లక్షలతో 550 మీటర్ల దూరం సీసీ రోడ్డు నిర్మించారు. అలాగే మరో ప్యాకేజీలో మరో ప్యాకేజీలో రూ.34లక్షలతో 600 మీటర్లమేర సీసీ రోడ్డుతోపాటు రక్షణగోడతో కూడిన రెండు కల్వర్టులు నిర్మించారు. సీసీ రోడ్డు ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణంలోనూ నాణ్యతకు పాతరేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన మెటల్ సైజు ఉపయోగించలేదని, మిక్సింగ్ మెటల్ ఇసుకను తలపిస్తోందని నిర్వాసితులు పేర్కొంటున్నారు. నిబంధనలకు తిలోదకాలి స్తూ..తమ బతుకులతో ఆడుకుంటున్నారని వా పోతున్నారు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు కలిసి..నిధులు కాజేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ప నుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాల్సిన ఇంజినీరింగ్ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారు లు స్పందించి నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. బిల్లులు చెల్లించలేదు రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని పీఆర్ విభాగం ఏఈ కృష్ణమూర్తి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ పరిశీలనలు జరుగుతాయని, నాణ్యతలో లోపా లు బయటపడితే..చర్యలు తప్పవన్నారు. అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టాలన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..
టీడీపీ హయాంలో అన్నీ అవకతవకలే...
నా ఓటు పథకాలిచ్చే ప్రభుత్వానికే..
రాష్ట్రంలో వైఎస్సార్సీపీదే అధికారం
సీఎం బహిరంగ సభను జయప్రదం చేయండి
వైఎస్సార్ కుటుంబానికి కిరణ్ వెన్నుపోటు
అభివృద్ధికి కేరాఫ్
30 మద్యం బాటిళ్లు స్వాధీనం
ఊటుకూరును భక్త కన్నప్ప జన్మస్థలంగా గుర్తించాలి
రాజంపేట మండలంలో రూ. 4.83 కోట్లు నష్టం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement