-
చిప్స్ ఉండగా పూల చింత ఏల!
‘పెళ్లి ఉరేగింపు కారును దేనితో అలంకరిస్తారు?’ అనే ప్రశ్నకు టక్కున వినిపించే జవాబు... పువ్వులు. పూల కొరతో, ఖర్చు అనుకున్నారో.. వైవిధ్యం కోసమో ఏమో తెలియదుగానీ ఈ పెళ్లి కారును ΄పోటాటో చిప్స్ ప్యాకెట్స్‌తో అలంకరించారు. సత్పాల్ యాదవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. చిప్స్‌తో ముస్తాబైన ఈ పెళ్లి కారు గురించి నెటిజనులు సరదాగా స్పందించారు. ‘΄పోటాటో చిప్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే పబ్లిసిటీ ఇది’ ‘చిప్స్ అంటే ఎంత ఇష్టముంటే మాత్రం ఇలానా!’ ‘చిప్స్‌కు బదులుగా ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో ముస్తాబు చేసి ఉంటే కారు వెంట జనాలు పరుగులు తీసేవారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది!
పెళ్లికూతుళ్లు సంప్రదాయాలను తిరగ రాస్తున్నారు. పెళ్లిపీటల మీద తల దించుకుని ఉండటం.. కాబోయే భర్త ఎదుట సిగ్గుల మొగ్గ కావడం.. అత్తారింటికి వెళ్లేప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం.. ఈ ‘సంప్రదాయ ధోరణి’ కాదని పెళ్లి రోజున పూర్తి ఉత్సాహంగా ఉంటున్నారు. జీవితంలో ముఖ్యమైన రోజును అణువణువు ఆనందమయం చేసుకోజూస్తున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అని పాడుతూ డాన్స్ చేస్తున్నారు. అంతేనా? అత్తారింటికి పక్కన భర్తను కూచోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. నిజంగా వీరు కొత్త పెళ్లికూతుళ్లే. నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 22న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక పెళ్లి జరిగింది. వధువు సనా షబ్నమ్, వరుడు షేక్ ఆమిర్. ఇప్పుడు వధువు అత్తారింటికి వెళ్లాలి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లిమంటపం గంభీరంగా ఉంటుంది. పెళ్లికూతురి తల్లిదండ్రులు భావోద్వేగాలకు లోనవుతారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన బంగారు తల్లి ఇప్పుడు తమ నుంచి వేరుపడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది కనుక ఆమె వైవాహిక జీవితం బాగుండాలని ఒక ఆకాంక్ష, ఆమె అక్కడ ఎలా ఉండ బోతోందోననే ఆందోళన... ఇవన్నీ వాతావరణాన్ని బరువెక్కిస్తాయి. పెళ్లికూతురు బొరోమని తన వాళ్లను పట్టుకుని ఏడుస్తుంది. పెళ్లికొడుకు సర్ది చెప్పి బండి ఎక్కిస్తాడు... సాధారణంగా జరిగే ఈ రివాజు మొత్తం ఆ రోజు ఆ పెళ్లిలో ఏమీ జరగలేదు. పెళ్లి ఇంటి దగ్గర బయట ఉన్న మహీంద్రా ఎస్.యు.వి వరకూ పెళ్లి కూతురు హుషారుగా నడిచి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూచుంది. భర్త ఆమిర్‌ను పాసింజర్ సీట్లో కూచోబెట్టుకుంది. ‘వెళదామా... అత్తారింటికి’ అని బండి స్టార్ట్ చేసింది. బంధుమిత్రులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికూతురి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. కశ్మీర్ లోయలో ఇలాంటి ‘విదాయి’ (అంపకాలు) ఎవరూ చూడలేదు. కాని పెళ్లికూతురు సనా షబ్నమ్ గతంలోని స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసింది. ‘నేను కశ్మీర్ పెళ్లిళ్ల మూస పద్ధతిని మార్చాలనుకున్నాను. సనా నన్ను కూచోబెట్టుకుని డ్రైవ్ చేయడం తన జీవితంలోని ముఖ్యరోజున విశేషం అవుతుందని భావించాను. ఆమె నన్ను కూచోబెట్టుకుని నడపడాన్ని ప్రోత్సహించాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చుగాని చాలామంది మెచ్చుకున్నారు’ అని సనా భర్త ఆమిర్ అన్నాడు. అతడు వృత్తిరీత్యా అడ్వకేట్. బారాముల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. కశ్మీర్ ముస్లింలలో సంప్రదాయాల పట్ల కట్టుబాటు ఉన్నా అక్కడ స్త్రీలు ఆధునికంగా ఆలోచించడాన్ని ఆహ్వానిస్తున్నారని ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది. అయితే నెల క్రితం కలకత్తాలో జరిగిన ఇలాంటి సంఘటనే ‘జండర్ మూస’ను బద్దలు కొట్టినట్టయ్యింది. సాధారణంగా భార్య జీవితానికి మార్గం చూపేవాడు భర్తే అవుతాడు సగటు పురుషస్వామ్య భావజాలంలో. భర్త ప్రతిదాన్ని లీడ్ చేస్తే భార్య అనుసరించాలి. ఇది పెళ్లయిన నాటి నుంచి సమాజం మొదలెడుతుంది. అంపకాల్లో పెళ్లికూతురి తండ్రి తన కుమార్తె చేతిని అల్లుడి చేతిలో పెట్టి ‘జాగ్రత్త నాయనా... ఎలా చూసుకుంటావో’నని ఎమోషనల్ అవుతాడు. సమాజం ఇంత ముందుకు వెళ్లినా స్త్రీలు తమ సామర్థ్యాలను నిరూపిస్తున్నా భార్యను భర్త మీద ఆధారపడే వ్యక్తిగా సంకేతం ఇచ్చే ‘అంపకాలను’ ఎందుకు తిరస్కరించకూడదు అని కోల్‌కతాకు చెందిన వధువు స్నేహా సింగ్ అనుకుంది. పెళ్లి అయ్యాక భారీ పెళ్లి లహెంగాలో భర్త సౌగత్ ఉపాధ్యాయను బండిలో కూచోబెట్టుకుని అత్తారింటికి బయలుదేరింది. ఇది దేశంలో చాలా వైరల్ వీడియో అయ్యింది. ‘ఇలా చేయాలని నెల క్రితమే నేను అనుకుని సౌగత్‌ను అడిగాను. అతడు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఆ సంగతి పెళ్లి కంగారులో మర్చిపోయి నేను పాసింజర్ సీట్లో కూచుంటే నువ్వు నడుపుతానన్నావుగా అని అతడే గుర్తు చేశాడు. నిజానికి సౌగత్‌ను కూచోబెట్టుకుని బండిలో తిప్పడం పెళ్లికి ముందు నుంచే నాకు అలవాటు. ఆ పనే ఇప్పుడూ చేశాను. అతని డ్రైవింగ్ నాకు భయం కూడా అనుకోండి’ అని నవ్వింది స్నేహా. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పోర్టేషన్ సరిగా ఉండేవి కాదు. అత్తారిల్లు పక్క ఊళ్లోనే అయినా దూరం అయినా రాకపోకలు మాటా మంతి అంతగా సాగేవి కావు. ఉత్తరాలనే నమ్ముకోవాల్సి వచ్చేది. పైగా ఆనాటి ఆడపిల్లలు సరైన చదువుకు, ఉపాధికి నోచుకోక భవిష్యత్తంతా అత్తారింటి మంచి చెడ్డల మీద ఆధారపడి ఉండేవారు. అందువల్ల పెళ్లి సమయాలలో పెళ్లికూతుళ్లు ఆందోళనగా, ఉద్వేగంగా, సమాజ పోబడికి తగ్గట్టు బిడియంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎంత దూరం వెళ్లినా, అమెరికాలో ఉన్నా అనుక్షణం తన వాళ్లకు కనపడుతూ వినపడుతూ ఉండే వీలు ఉంది. ఒక్కరోజు తేడాలో ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్లికి ముందు కొద్దో గొప్పో మాటలు నడిచి పెళ్లి నాటికి స్నేహం కూడా ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో పూర్తిగా కొత్త ఆలోచనల పెళ్లికూతుళ్లు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వధువు సాయి శ్రీయ వరుడు అశోక్‌తో అంపకాల సమయంలో అత్తారింటికి సంతోషంగా వెళుతూ ప్రైవేటు గీతం ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు చేసిన నృత్యం దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో సాయి శ్రీయ తన భర్తను చూస్తూ సంతోషంగా డాన్స్ చేస్తుంటే భర్త కూడా ఎంతో ముచ్చట పడుతూ చూడటాన్ని జనం మెచ్చుకున్నారు. ఆ జంటను ఆశీర్వదించారు. నిన్న మొన్నటి వరకు అబ్బాయికి విందులో ఏది ఇష్టం, మంటపం ఏది బుక్ చేయమంటాడు, పెళ్లి ఎలా జరగాలంటాడు వంటి ప్రిఫరెన్సు దక్కేది. ఇప్పుడు అమ్మాయికి ఏది ఇష్టం, ఏం కావాలంటోంది, ఏది ముచ్చపడుతోంది అని అడిగి అంగీకరించే పరిస్థితికి నేటి ఆడపిల్లలు వీలు కల్పిస్తున్నారు. సంతోషాల ఎంపికలో ఆమెకూ సమాన భాగం దొరికితే ఆ వివాహం మరెంతో సుందరం కదా. -
బారాత్‌లో వరుడి కాల్పులు
- పాతబస్తీలో ఘటన... సోషల్ మీడియాలో కలకలం - నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్: బ్యాండ్ బాజాలతో పెళ్లి బారాత్ ఉత్సాహంగా సాగుతుంటే... ఇంతలో గుర్రంపైనున్న వరుడు ‘గుళ్ల’ చప్పుళ్లతో వణుకు పుట్టించాడు. ఉన్నట్టుండి రెండు చేతులూ పైకిత్తి.. రెండు తుపాకులు చేతపట్టి... గాల్లోకి పది రౌండ్లు ఏకధాటిగా కాల్చేసరికి అక్కడున్నవారంతా షాకై... షేకయ్యారు. గత నెల 22న ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలోకి అప్లోడ్ అవ్వడంతో... ఆదివారం నగరంలో కలకలం రేగింది. దీన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో పోలీసులు పరుగులు పెట్టారు. ఎప్పుడు... ఎక్కడ జరిగిందనే విషయాన్ని కూపీ లాగి... ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. చివరకు అతడు ఉపయోగించింది సినిమాల్లో వాడే డమ్మీ తుపాకీలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. వీడియోలో హోటల్ పేరుతో... వీడియోలో కనిపించిన హోటల్ కేఫ్ అల్ హబీబ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పాతబస్తీ జహనుమాలోని షమా టాకీస్ సమీపంలో ఉన్న ఈ హోటల్‌కు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ, ఇన్స్పెక్టర్ యాదగిరి వెళ్లారు. గత నెల 22న జరిగిన బారాత్పై ఆరా తీయగా... కాల్పులు జరిపింది ఇంజన్బౌలికి చెందిన మహ్మద్ అఫ్జలుద్దీన్ కుమారుడు ఇర్ఫానుద్దీన్(25) అని కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే కాల్పులు జరిపినట్టు నిందితుడు విచారణలో అంగీకరించారు. అతడు వాడింది సినిమాల్లో తుపాకీగా నిపుణులు నిర్థారించారు. వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. గతంలో చిన్న చిన్న గొడవల సందర్భంలో నిందితుడు ఈ తుపాకులతో బెదిరించినందుకు ఫలక్‌నుమా పీఎస్ పరిధిలో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. నగరంలోని లఘు చిత్రాల నిర్మాత ఎస్ఎం అలీ ఈ తుపాకులను ఇర్ఫానుద్దీన్కు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఇర్ఫానుద్దీన్పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశామని, పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని తెలిపారు. అలీపైనా కేసు నమోదు చేశామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్‌పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement