-
‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
టెక్ కంపెనీల మధ్య నిత్యం పోటీ ఉంటుంది. వినియోగదారులకు అందించే సేవలతో పాటు ఇతర విషయాల్లో ఆ సంస్థల యజమానుల్లో ఆ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా వికీపిడియా సహవ్యవస్థాపకుడు జిమ్మీవేల్స్ ఎలాన్‌మస్క్ సారధ్యంలోని ఎక్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి చాట్‌బాట్స్ ఆధారిత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) వికీపిడియా డేటాను ఉపయోగిస్తున్నాయని, మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ డేటాను కాదని జిమ్మీ వేల్స్ అన్నారు. పోర్చుగల్‌లోని లిస్బన్లో జరిగిన వెబ్ సమ్మిట్‌లో జిమ్మీ వేల్స్ మాట్లాడారు. ఎలాన్‌మస్క్, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. సరైన సమాచారానికి ఎక్స్ నమ్మదగిన వేదిక కాదన్నారు. ట్విట్టర్‌కు (ఎక్స్) బదులు ఎల్ఎల్ఎంలు వికీపిడియా డేటాను వినియోగించడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా మస్క్ ఆఫర్ చేస్తున్న ఏఐ చాట్‌బాట్ గ్రోక్ గురించి తానిప్పటివరకూ వినలేదని వేల్స్ చెప్పారు. మరోవైపు ఎలన్ మస్క్ ఇటీవల వికీపిడియాపై చేసిన వ్యాఖ్యలపై డిబేట్ సాగింది. వికీపీడియా తన వెబ్సైట్ పేరును డికీపీడియాగా మార్చుకోవాలని మస్క్ సూచించారు. తన సూచనకు అనుగుణంగా వారు పేరు మారిస్తే ఆ వెబ్‌సైట్‌కు మిలియన్ డాలర్లు ఇస్తానని మస్క్ వ్యాఖ్యానించారు. -
అర్షదీప్ వ్యవహారం.. కేంద్రం తీవ్రస్పందన
టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్‌పై కొందరు టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆదివారం పాక్‌తో మ్యాచ్ సందర్భంగా.. మ్యాచ్‌ను మలుపు తిప్పే కీలకమైన క్యాచ్‌ను వదిలేశాడంటూ అర్షదీప్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లు, మాజీల మద్దతు అతనికి లభిస్తోంది. అయితే.. అర్షదీప్ సింగ్ వ్యవహారంలో అనుచితమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని కొందరు బైకులపై తిరుగుతూ గోల చేయడం తెలిసిందే. తాజాగా అతనికి నిషేధిత సంస్థ ఖలీస్తానీతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. అతని వికీపీడియా పేజీలో భారత్ స్థానంలో ఖలిస్తాన్ అంటూ ఎడిట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. అయితే.. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, పైగా అర్షదీప్ కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారం ఎలా ప్రచురితమైందో వివరణ ఇవ్వాలని అందులో కోరింది. ఇదిలా ఉంటే.. అర్షదీప్ వికీపీడియా పేజీలో భారత్ అని ఉన్న చోట.. ఖలిస్తాన్ అని జత చేశారు. అది అన్‌రిజిస్టర్డ్ అకౌంట్ నుంచి జత అయినట్లు తెలుస్తోంది. అయితే.. 15 నిమిషాలోపే వికీపీడియా ఎడిటర్స్ ప్రొఫైల్‌ను సవరించారు. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత అర్షదీప్ సింగ్‌పై కొందరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్లో మూడో బంతికి రవి బిష్ణోయ్ వేసిన బంతిని అసిఫ్ అలీ స్వీప్ షాట్ అడగా.. సలువైన క్యాచ్‌ను అర్షదీప్ జారవిడిచాడనే విమర్శ చెలరేగింది. అయితే.. ఉత్కంఠభరితమైన చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ పరుగుల కట్టడికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్షదీప్‌కు విపరీతమైన మద్దతు లభిస్తోంది. Catch drop by arshdeep singh 😭#arshdeepsingh #INDvPAK #INDvsPAK2022 pic.twitter.com/ttxabkCArI — Girish Singh rajput (@GirishSinghraj3) September 4, 2022 Senior pro Virat Kohli backs youngster Arshdeep Singh, who had a volatile day at the field today#AsiaCup2022 #INDvsPAK #ViratKohli #ArshdeepSingh pic.twitter.com/FYPl5N4PMx — OneCricket (@OneCricketApp) September 4, 2022 He is best in death overs , we can’t blame for his one match.. I stand with #arshdeepsingh #INDvsPAK2022 pic.twitter.com/pDkbYTrBWY — Karan Sandhu (@Karanbi03633746) September 5, 2022 #NewProfilePic pic.twitter.com/ksSXCNMOgC — Aakash Chopra (@cricketaakash) September 5, 2022 ఇదీ చదవండి: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా? -
శామ్యూల్‌గా మారిన సిద్దరామయ్య!
బెంగళూరు: గోమాంసం తినడాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంతి సిద్దరామయ్య లక్ష్యంగా ఆన్‌లైన్‌లోనూ దాడి జరుగుతున్నది. ఓ దుండగుడు వికీపీడియా వెబ్‌సైట్‌లోని ఆయన పేజీ పేరును మార్చివేశాడు. సిద్దరామయ్య పేరును కాస్తా శామ్యూల్‌గా మార్చాడు. గోమాంసం తినడానికి తాను సిద్ధమని సిద్దరామయ్య ప్రకటించిన కొంతసేపటికే ఇది జరిగింది. గోమాంసం తింటే ఆయన తల నరికేస్తామని ఇప్పటికే బీజేపీ స్థానిక నాయకుడు ఒకరు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వికీపీడియాలో ఆయన పేరు మారిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ అంశాన్ని అడ్మినిస్ట్రేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే శామ్యూల్ పేరును తొలగించి.. ఆయన పేరును పునరుద్ధరించారు. వికీపీడియా వెబ్సైట్లో వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా పొందపరిచే వీలుండటంతో దుండగుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. బీఫ్ వివాదం నేపథ్యంలో సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఆన్లైన్లో విద్వేషపూరితమైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయని, అందులో భాగమే ఈ చర్య అని కర్ణాటక సీఎం మీడియా కోఆర్డినేటర్ కేవీ ప్రభాకర్ తెలిపారు. కర్ణాటకలో గోమాంసంపై నిషేధం విధించాలన్న బీజేపీ డిమాండ్‌పై స్సందిస్తూ.. తాను ఇప్పటివరకు గోమాంసం తినలేదని, అయితే ఇప్పుడు తినాలని అనిపిస్తున్నదని, నన్ను అడిగేందుకు వారు ఎవరు అని సిద్దరామయ్య ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement