-
ఆ ఊరంతా అద్దెకు.. ఒక్క రోజుకు ఎంతంటే?
ఏదైనా ఊరికి బదిలీ అయితే, ఆ ఊళ్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం మామూలు. కొద్దిరోజుల పనికోసమే అయితే, హోటల్ గది అద్దెకు తీసుకోవడమూ మామూలే. ఇటలీలోని ఒక చిత్రమైన ఊరుంది. ఎవరైనా నిర్ణీత మొత్తం చెల్లిస్తే, ఏకంగా ఆ ఊరంతటినీ అద్దెకు తీసుకోవచ్చు. ఇటలీ నడిబొడ్డున ఉండే లె మార్షె ప్రాంతంలో ఉన్న ఈ మధ్యయుగాల నాటి ఊరి పేరు పెట్రిటోలి. రోమన్ నాగరికత కాలం నాటి పురాతన కట్టడాలు, వాటిలోని నేలమాళిగలు, బోటిక్ లాడ్జింగులు, వాటితో పాటే ముప్పయ్యేడు పడకగదుల భారీ రాచప్రాసాదం, ఒక రంగస్థల వేదిక ఈ ఊరి ప్రత్యేకతలు. వీటన్నిటితో కూడిన ఈ ఊరును అద్దెకు తీసుకోదలచుకున్న వారు రోజు 1303 పౌండ్లు (రూ.1,28,577) చెల్లించాల్సి ఉంటుంది. యూరోప్‌లోని సంపన్నుల్లో చాలామంది కుటుంబ సమావేశాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు వంటి కార్యక్రమాల కోసం దీనిని అద్దెకు తీసుకుంటున్నారు. సముద్రమట్టానికి మూడువందల మీటర్ల ఎత్తున ఉండే ఈ ఊరి వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. చదవండి: Winter Festivals: శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని రాయడంతో! శీతాకాల సంబరాల విశేషాలు.. -
నా ఇష్టం శ్రీదేవికి తెలియకూడదనుకున్నా!
బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్ ఎంత పెద్ద స్టారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారాయన. ‘లగాన్, పీకే, దంగల్’ వంటి సినిమాలతో సినీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆమీర్ ముందు ‘మీకు ఇçష్టమైన నటీనటులు ఎవరు?’ అన్న ప్రశ్న ఉంచితే– ‘‘అమితాబ్ బచ్చన్‌గారంటే ఇష్టం’’ అని టకీమని చెప్పారు. ఆ తర్వాత ఒక్క క్షణం ఆగి.. ‘‘నటి శ్రీదేవికి నేను పెద్ద ఫ్యాన్‌ని. నా కెరీర్ మొదట్లోనే ఆమె అంటే ఇష్టం మొదలైంది. ఓ మ్యాగజీన్ ఫొటోషూట్ కోసం శ్రీదేవిని కలిశాను. అప్పుడు ఆమె కళ్లలోకి నా కళ్లు పెట్టి చూస్తే నా మనసులో ఉన్న ఇష్టం ఆమెకు ఎక్కడ తెలిసిపోతుందోనని వీలైనంత వరకూ నా చూపులను పక్కకు తిప్పుకునేలా ప్రయత్నించాను. ఆమెతో కలిసి ఇంగ్లీష్ మూవీ ‘రోమన్ హాలీడే’ హిందీ రీమేక్‌లో నటించాలనుకున్నా. ఈ ఆలోచన గురించి దర్శకుడు మహేశ్భట్తో చర్చించాను కూడా’’ అని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు ఆమిర్. ఇదిలా ఉంటే.. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య తారలుగా నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైందని బాలీవుడ్ టాక్. -
మొత్తం హాలీవుడ్ చలవే!
ఆ సీన్ - ఈ సీన్ ‘మల్లీశ్వరి’... దగ్గుబాటి వెంకటేశ్, కత్రినా కైఫ్‌లు హీరో హీరోయిన్లుగా, విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన త్రివిక్రమ్ విరచిత హిట్ సినిమా. ఈ సినిమా టైటిల్‌ను అలనాటి ‘మల్లీశ్వరి’ సినిమా స్ఫూర్తితో పెట్టుకున్నారనేది సుస్పష్టమైన అంశం. 1951లో ఎన్టీఆర్, భానుమతీ రామకృష్ణలు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రరాజం ‘మల్లీశ్వరి’. మళ్లీ అదే పేరుతో, 2004లో విడుదలయిన చిత్రమిది. అయితే టైటిల్‌ను పాత తెలుగు సినిమా నుంచి తీసుకున్నారు కానీ... కథ, కథనాలను మాత్రం హాలీవుడ్ నుంచే ఎత్తుకొచ్చారు. మన నయా ‘మల్లీశ్వరి’కి మార్గం చూసిన ఆ ఆంగ్ల చిత్రం గురించి తెలుసుకోవాలంటే యాభై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. సాధారణంగా... కాపీ కొట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఒక్కసారి ఆ ధైర్యం వచ్చిందంటే... ఆపై చాలా వరకూ వ్యక్తిగత సృజన చచ్చిపోతుంది. ఆలోచనల్లో పదునూ తగ్గిపోతుంది. అయితే త్రివిక్రమ్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. కథాంశాన్ని విదేశీ సినిమాల నుంచి స్వీకరించడానికి ఏమాత్రం మొహమాటపడని ఈ రచయిత, దాన్ని తెలుగువారి అభిరుచికి అనుగుణంగా వండి వార్చడంలో ఎంతో ప్రతిభను ప్రద ర్శిస్తారు. ఆయనలోని ఆ ప్రతిభను ఆవిష్కరించిన చిత్రం ‘మల్లీశ్వరి’. అయితే ఈ సినిమా కథ విషయంలో ఒరిజినల్ రచయితలకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వని ఈ రచయిత, తెలుగు వెర్షన్ సినిమాను ప్రెజెంట్ చేయడంలో కూడా ఆ స్థాయిని రీచ్ కాలేకపోయారన్నది కాదనలేని నిజం. 1953లో విడుదలైన ‘రోమన్ హాలీడే’ అనే ఆంగ్ల కళాఖండాన్ని... తెలుగులో ఒక సాధారణ కమర్షియల్ సినిమాగా మార్చే శారు త్రివిక్రమ్. రాజ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువతి, సాధారణ జీవితాన్ని గడపడం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘రోమన్ హాలీడే’. రాజకుమారి అని తెలీక ఆమెను ప్రేమించే హీరో, అతనిని ఆమె సరదాగా ఏడిపించే తీరు, వీరిద్దరి మధ్య హీరో సహాయకుడు... ఈ పాత్రల తీరు ‘మల్లీశ్వరి’లో వెంకటేశ్, కత్రినాకైఫ్, సునీల్ పాత్రలకు స్ఫూర్తి అన్నది స్పష్టం. జన సామాన్యంలోకి వచ్చిన రాజకుమారి అమాయకత్వాన్ని ఎలివేట్ చేసే సీన్లలో కూడా ఇరు సినిమాల మధ్య బోలెడు పోలికలుంటాయి. తేడా ఏమిటంటే... తెలుగు వెర్షన్లో హీరో, హీరోయిన్ల కథలు సమాంతరంగా నడుస్తాయి. వాటికి ‘పెళ్లి కాని ప్రసాద్’ పాయింట్‌ని యాడ్ చేశారు. హీరోని అంతఃపురంలోకి పంపి సరదా సీన్లను క్రియేట్ చేశారు. అయితే ఈ కాపీ ‘రోమన్ హాలీడే’తో ఆగిపోలేదు. కత్రినా కైఫ్ ప్యాలెస్‌లో కుక్కతో ఉండే కామెడీ, మరికొన్ని సీన్లు కూడా కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి తస్కరించినవే! ఇలా సీన్ల వారీగా లెక్కగ డితే ‘మల్లీశ్వరి’లో ‘రోమన్ హాలీడే’తో పాటు చాలా హాలీవుడ్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి! మూలకథ ‘రోమన్ హాలీడే’ నుంచి తీసుకొని, హాలీవుడ్ రొమాంటిక్ కామెడీల నుంచి కొన్ని సీన్లను తీసుకుని సినిమాను అల్లుకుంటూ పోయి.. క్లైమాక్స్ దగ్గర మళ్లీ ‘రోమన్ హాలీడే’ మంత్రం పఠించారు రచయిత. ప్రెస్‌మీట్ పెట్టి మల్లీశ్వరిని రాజకుమారిగా పరిచయం చేసే పతాక సన్నివేశాలు సైతం హాలీవుడ్ సినిమా లోనివే. ఈ సీన్లో వెంకటేశ్, సునీల్‌లు జర్నలిస్టులమంటూ ఆ ప్రెస్ మీట్‌కు వెళతారు కదా! అయితే హాలీవుడ్ సినిమాలో హీరో, అతడి సహాయకుడు నిజంగానే జర్నలిస్టులు. ‘మల్లీశ్వరి’లో హీరో, హీరోయిన్లు ఒక్కటవ్వడంతో సినిమా సరదాగా ముగుస్తుంది. కానీ హాలీవుడ్లో మాత్రం సెన్సిబుల్ ట్రాజెడీ ఎండింగ్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ ‘రోమన్ హాలీడే’ విలువను పెంచుతుంది. అదే ఆ సినిమాను అకాడెమీ అవార్డు వరకూ తీసుకెళ్లిందని పిస్తుంది. కానీ మనకు విషాదాంతాలు నచ్చవు కాబట్టి, తెలుగులో అదొక్కటీ మార్చి ఉంటారనుకోవాలి! - బి.జీవన్‌రెడ్డి
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement