-
లిఫ్టు ఏర్పాటు చేస్తేనే.. ఓట్లేస్తాం!
తిరుమలగిరి (నాగార్జునసాగర్) : సాగు నీరందించేందుకు లిఫ్టు ఏర్పాటు చేస్తేనే.. ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని 7 గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని నెల్లికల్, జాల్‌తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతండా, సఫావత్తండా, చెంచో నితండా, మూలతండా గ్రామాల రైతులు రాజకీయపార్టీలకు అతీతంగా ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. లిఫ్టు నేపథ్యం.. : ఆ ఏడు గ్రామాలకు సాగు నీరందించేలా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు హామీలిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత దీనిపై ప్రశ్నిస్తే పలు కారణాలు చెబుతూ దాటవేస్తున్నారు. 2011 సంవత్సరంలోనే నెల్లికల్ లిఫ్టు నిర్మాణానికి అప్పటి ఇరిగేషన్ శాఖ అధికారులు రూ.60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవడానికి ప్రభుత్వం కూడా అనుమతులిచ్చింది. సుమారు 9 ఎకరాలు అటవీ భూమి మీదుగా పైపులైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ద్వారా అనుమతులు పొందాల్సి వచ్చింది. దీంతో అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా నెల్లికల్ రెవెన్యూ శివారులోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్యావరణ, హరిత ట్రిబ్యునల్‌కు ప్రభుత్వ భూమి బదలాయింపు ప్రతిపాదనలు రాష్ట్ర అటవీ, ఐడీసీ అధికారుల ద్వారా చేరవేశారు. దీంతో గతేడాది డిసెంబర్లో ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరిశీలించారు. ఈ నెల 20న హాలియాలో జరిగిన సమావేశంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి లిఫ్టు ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చా యని జనవరిలో పనులు ప్రారంభవుతాయని తెలిపారు. ఈ లిఫ్టు పూర్తయితే ఆ ఏడు గ్రామాల్లో మొత్తం 7,262 ఎకరాలకు సాగునీరు అందుతుంది. -
బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం
నంగునూర్(మెదక్ జిల్లా): మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రమాదవ శాత్తు బురదలో కూరుకుపోయారు. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా నంగునూర్ మండలంలోని ఎర్రచెరువు వద్ద జరిగింది. వివరాలు.. మండలంలోని ఎర్రచెరువు పూడిక తీతకు రూ.55లక్షలను కేటాయించారు. ఈ క్రమంలోనే పూడిక తీత పనులను పర్యవేక్షించేందుకు మంత్రి హరీష్‌రావు వెళ్లారు. ఆ సమయంలో మంత్రి ప్రమాదవశాత్తు ప్రొక్లేన్ పూడికతీస్తున్న మట్టిలో కూరుకుపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, డ్రైవర్‌ను హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం సిబ్బంది మంత్రిని బురదలో నుంచి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement