130 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 10:00 PM

- - Sakshi

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ దిగువన ఉన్న జ ల విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం 130 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఇది ఎస్సారెస్పీ జల విద్యుదుత్పత్తి కేంద్రం చరిత్రలోనే మూడవ అత్యధికం. 1990–91లో 146 మిలి యన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి మొదటి అత్యధికం. 1998–99లో 137 మిలియన్‌ యూనిట్లు రెండవ అ త్యధికంగా జరిగింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 31 రోజులు ఉండటంతో రికార్డును బ్రేక్‌ చేయకున్న,కనీసం రెండో స్థానంలో ని లుస్తుందని జెన్‌కో అధికారులుఅంచన వేస్తున్నారు.

ఇంకా 12–15 మిలియన్‌ యూనిట్లు..

కాకాతీయ కాలువ ద్వారా నీటి విడుదల ఆధారంగా విద్యుదుత్పత్తి జరుగుతుంది. మార్చి నెలంతా కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల జరుగుతుంది. దీంతో కనిష్టంగా మరో 12 మిలియన్‌ యూనిట్లు, గరిష్టంగా 15 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని అధికారులు అంచన వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ నీటి మట్టం తగ్గడంతో హెడ్‌ లెవల్‌ తగ్గుతుంది. దీంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరగడం కష్టంగా ఉంటుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రావడం, ఎస్కెప్‌ గేట్ల ద్వారా 100 రోజుల కంటే ఎక్కువ నీటి విడుదల గోదావరిలోకి నిరంతరం కొనసాగడంతో ఇంతటి విద్యుదుత్పత్తి సాధ్యమైనట్లు అధికారులు తెలుపుతున్నారు. 2015–16లో ఒక్క మిలియన్‌ యూనిట్‌ కూడ విద్యుదుత్పత్తి చేపట్టలేదు. ప్రాజెక్ట్‌లో ఆ సంవత్సరం నీటిమట్టం డెడ్‌లెవల్‌ కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. దీంతో కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టలేదు.

విద్యుదుత్పత్తి చేపడుతున్న టర్బయిన్లు

ఎస్సారెస్పీ జలవిద్యుత్‌ కేంద్రం

చరిత్రలో మూడో అత్యధికం

1990–91లో అత్యధికంగా 146 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి

Advertisement
Advertisement