12న సీవోఈలో ప్రవేశానికి ఎంట్రన్స్‌ టెస్ట్‌ | Sakshi
Sakshi News home page

12న సీవోఈలో ప్రవేశానికి ఎంట్రన్స్‌ టెస్ట్‌

Published Fri, Mar 10 2023 12:44 AM

-

ఆదిలాబాద్‌రూరల్‌: గిరిజన గురుకులాల కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) జూనియర్‌ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీనివాసస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో ఉదయం 9గంటలకు నిర్వహించే సీవోఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు. హాల్‌ టికెట్‌, ప్యాడ్‌, బ్లాక్‌, బ్లూ పెన్‌ వెంట తీసుకురావాలని, పూర్తి వివరాలకు 9849390495 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement