‘జగనన్నకు చెబుదాం’ వినతులపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

‘జగనన్నకు చెబుదాం’ వినతులపై ప్రత్యేక దృష్టి

Published Sat, Nov 18 2023 12:28 AM

గిరిజనుల నుంచి వినతులను స్వీకరిస్తున్నకలెక్టర్‌ సుమిత్‌కుమార్‌  - Sakshi

సాక్షి,పాడేరు: జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన వినతులపై అన్నిశాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏలో ప్రత్యేక స్పందన నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 71 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వే, ఇంజినీరింగ్‌ విభాగాలు, వ్యవసాయశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న వినతుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ శివశ్రీనివాస్‌, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఎస్‌డీసీ వి.వి.ఎస్‌.శర్మ, గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని..

● అటవీ హక్కుపత్రాలు మంజూరు చేయాలని పాడేరు మండలం కుజ్జెలి గ్రామానికి చెందిన గిరిజనులు కించేయి నాగమణి,పాంగి రత్నకుమారి,కిల్లో సత్యవతి వినతిపత్రం అందజేశారు.

● పెదబయలు మండలం లింగేటి పంచాయతీ కేంద్రం నుంచి కుంకంమామిడికి రోడ్డు నిర్మించాలని పి.కొండబాబు, మోహనరావు, నరేష్‌, కిముడుపల్లి పంచాయతీ వంతిర్భ గ్రామంలో అంగన్‌వాడీ భవనం నిర్మించాలని కె.బాబూరావు, కామేశ్వరరావు కోరారు

● పాడేరు మండలం ఇరాడపల్లి పంచాయతీ డి.సంపలు గ్రామంలో అంగన్‌వాడీ భవనం నిర్మించాలని సర్పంచ్‌ గుల్లెల అశ్విజ, ఎస్‌.బొడ్డాపుట్టు గ్రామానికి విద్యుత్‌లైన్‌ను ఎగుసోలములు మీదుగా మార్పు చేయాలని ఆ ప్రాంతానికి చెందిన మహేష్‌, నాగేశ్వరరావు కోరారు.

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాలు

71 అర్జీల స్వీకరణ

Advertisement
Advertisement