Sakshi News home page

స్కిల్‌ స్కామ్‌ కేసులో మరో సంచలనం.. టీడీపీకి, స్కిల్‌ కార్పొరేషన్‌కు ఒక్కరే అడిటర్‌

Published Fri, Oct 6 2023 1:24 PM

AAG Ponnavolu Sudhakar Reddy Arguments on CBN Bail Plea - Sakshi

సాక్షి, విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఇరపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా.. ఇవాళ(శుక్రవారం) అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తుది వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ఇవాళ కూడా కొన్ని సంచలన విషయాల్ని బయటపెట్టారాయన.  

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్కిల్‌ స్కామ్‌లో టీడీపీ ఖాతాలోకి మళ్లిన నిధుల వ్యవహారాన్ని నిన్న వాదనల సందర్భంగా డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన ఏఏజీ సుధాకర్‌రెడ్డి..  మూడవ రోజు వాదనలోనూ సంచలనాలు వెలుగులోకి తెచ్చారు. టీడీపీకి.. స్కిల్ స్కామ్‌లో ఆడిటర్‌గా పని చేసిన వ్యక్తి ఒక్కరేనని.. ఆయన్ని విచారిస్తే కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని  కోర్టుకు తెలియజేశారు ఏఏజీ పొన్నవోలు. 

ఈ కేసులో టీడీపీ అడిటర్‌ వెంకటేశ్వర్లుని విచారించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారణకి రావాలని ఆయనకి నోటీసులిచ్చాం. ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పోరేషన్కి ఆడిటర్ గా పనిచేశారు. ఈ రెండింటికీ ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మల్లింపు వ్యవహారం బయటపడకుండా మేనేజ్ చేశారు. తద్వారా చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు.

పైగా సీఎం హోదాని చంద్రబాబు అడ్డు పెట్టుకుని షెల్‌ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారు. జీవో నెంబర్‌ 4 ని అడ్డం పెట్టుకుని నిధులు దిగమింగారు. కాబట్టి.. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది అని పొన్నవోలు కోర్టులో వాదించారు. ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబును విచారించాల్సి ఉందని ఏఏజీ పొన్నవోలు ఏసీబీ కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారాయన.

చంద్రబాబు సహకరించలేదు
బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత.. చంద్రబాబు కస్టడీ పిటీషన్పై ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణం‌ కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు గత రెండు రోజుల‌కస్టడీలో సీఐడీకి సహకరించలేదు. సెంట్రల్ జైలులోనే చంద్రబాబుని మరోసారి‌ విచారించడానికి అవకాశమివ్వండి. [di చంద్రబాబుని కనీసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వండి. చంద్రబాబుని విచారణ చేస్తేనే కొంతవరకైనా నిజం బయటకి వస్తుంది అని కోర్టును కోరారాయన. ఇక బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరించారన్న చంద్రబాబు లాయర్ల ఆరోపణలపై ఏఏజీ పొన్నవోలు స్పందించారు.  చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఐటీ రిటర్స్ని మాత్రమే డౌన్ లోడ్ చేశాం. బ్యాంకర్ల నుంచి ఎక్కడా తీసుకోలేదని స్పష్టత ఇచ్చారాయన. 

Advertisement

తప్పక చదవండి

Advertisement