ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొంది | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో బాధితులంతా డిశ్చార్జ్‌ అయ్యారు

Published Sun, Dec 13 2020 12:04 PM

All The Victims Recovered In Eluru Says Minister Alla Nani - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొందని, అంతుచిక్కని వ్యాధి కారణంగా అనారోగ్యం పాలై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా డిశ్చార్జ్‌ అయ్యారని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. మెడికల్ టీమ్‌లు బాధితుల ఇంటికెళ్లి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాయని, బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నామని వెల్లడించారు. 650 కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్నామని చెప్పారు. 5 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్, కూరగాయలు ఇస్తున్నామన్నారు. ( రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం)

మూడు రోజుల్లో తుది నివేదిక వస్తుందని, తుది నివేదిక బట్టి అస్వస్థతకు కారణాలు తెలుస్తాయని అన్నారు.అంతకుక్రితం, ఏలూరు టూటౌన్‌, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లిన మంత్రి ఆళ్లనాని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. 

Advertisement
Advertisement