Chandrababu: చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్‌.. | AP High Court Dismissed Chandrababu Naidu's Three Petitions - Sakshi
Sakshi News home page

Chandrababu: చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్‌..

Published Mon, Oct 9 2023 11:00 AM

AP High Court Dismissed Chandrababu Three Petitions - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, అంగళ్లు దాడుల కేసు, ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు వేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 

వివరాల ప్రకారం, చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు కేసులకు సంబంధించిన బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, ఫైబర్‌ నెట్‌ కేసు, అంగళ్లు దాడులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ తిరస్కరణ, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు దాడుల కేసులో బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. 

ఫైబర్‌ నెట్‌ కేసు ఇదే..
టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధు­లతో చేపట్టిన ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్ని­హి­తు­డైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది. చంద్ర­బాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టి­పెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టు­బడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు.

పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా..
ఫైబర్‌ నెట్‌ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్ట­బెట్ట­డం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పర­స్పర ప్రయో­జ­నాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియ­మి­ం­చారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించ­డంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్‌ నెట్‌ టెండర్ల మదింపు కమిటీ­లోనూ సభ్యుడిగా నియ­­మించారు.

ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధ­ననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్‌ సంస్థ అప్పటికే బ్లాక్‌ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజె­క్టులను సకాలంలో పూర్తి చేయ­లేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్‌ లిస్ట్‌ జాబితా నుంచి టెరా సాఫ్ట్‌ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్క­న­బెట్టి మరీ టెరా సాఫ్ట్‌ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు..
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌లో మార్పు­లు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్ర­బాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అను­గుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్ర­బాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్‌ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్‌ ప్రోకోయేనని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: బాబు కనుసన్నల్లోనే ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు
ఇది కూడా చదవండి: తోడు దొంగల ‘రింగ్‌’!

అంగళ్లు కేసు ఇదే.. 
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజ­క­వర్గం అంగళ్లులో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడు­లకు సంబంధించి టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డీఆర్‌.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద ఎస్‌ఐ షేక్‌ ముబిన్‌తాజ్‌ కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘అంగళ్లు’ దాడుల కేసులో ఎ1గా చంద్రబాబు

Advertisement
Advertisement