AP Minister Mekapati Goutham Reddy Biography And Political Journey In Telugu - Sakshi
Sakshi News home page

Mekapati Goutham Reddy: తండ్రికి తగ్గ తనయుడు.. ఒకే ఒక్కడు..

Published Mon, Feb 21 2022 10:48 AM

AP Minister Mekapati Goutham Reddy Political Journey In Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) సోమవారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఉదయం  హైదరాబాద్‌లోని ఇంట్లో గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే గౌతమ్‌ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అపోలో అసుపత్రికి తీసుకొచ్చి చివరి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.  మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని హైదరాబాద్‌ బయల్దేరారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగు జాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజమోహన్‌రెడ్డి 1985లో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. అనంతరం 1989, 2004, 2009, 2012, 2014లో ఒంగోలు, నర్సరావు పేట, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజమోహన్‌రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు.  గౌతమ్‌రెడ్డి బాబాయ్‌ చంద్రశేఖర్‌రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కూడా 2004, 2009, 2012ల్లో ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
చదవండి: మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం: హైదరాబాద్‌ బయల్దేరిన సీఎం జగన్‌ 


చదవండి: మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం 

Advertisement

తప్పక చదవండి

Advertisement