Babu in Jail : చంద్రబాబు రిమాండ్ ఆర్డర్‌లో కీలకాంశాలు | Sakshi
Sakshi News home page

Babu in Jail : చంద్రబాబు రిమాండ్ ఆర్డర్‌లో కీలకాంశాలు

Published Mon, Sep 11 2023 2:09 PM

Chandrababu Naidu Remand Report Complete Details - Sakshi

స్కిల్‌స్కామ్‌ కేసులో విజయవాడ ACB ప్రత్యేక కోర్టు.. చంద్రబాబు రిమాండ్‌ ఆర్డర్‌ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబునాయుడిని కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు CID అధికారులు కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది. నంద్యాలలో సెప్టెంబర్‌ 9, 2023, శనివారం రోజు 6గంటలకు చంద్రబాబును అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్నారు.

 చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవే..

👉: 30.1.2015న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఉన్నత విద్యా మండలి ద్వారా నడిపించేందుకే సుబ్బారావును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించిన చంద్రబాబు అవినీతికి తెరలేపారు.

👉: ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీమెన్స్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పేరేషన్లో డిప్యూటి సీఈఓగా నియమించారు. ఈమెను మూడునెలల ముందే ప్రజంటేషన్లో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రాజెక్టు వివరాలన్నీ అపర్ణకు షేర్ చేశారు. 

👉: రూల్సుకు విరుద్ధంగా… సీమెన్స్ నుంచి 90శాతం నిధులు రాకుండానే నేరుగా ప్రభుత్వం వాటా అయిన 10శాతం నిదులు మొత్తం 371కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా కార్యదర్శి పివి రమేష్, చీఫ్ సెక్రటరీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 

సాక్ష్యధారాలు మాయం చేసిన చంద్రబాబు…

👉:​​​​​​​ డిజైన్టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్‌ ఫైల్‌ను సుబ్బారావు OSD NVK ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. 

👉:​​​​​​​ ఈ కేసులో నిధులు కొల్లగొట్టేందుకు… 20.10.2014న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ చార్టెడ్ అకౌంటంట్‌గా లక్ష్మినారాయణ(A-4) బంధువు వెంకటేశ్వర్లును జీవో నెంబర్- 48 ద్వారా నియమించారు

చంద్రబాబు విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది…

👉:​​​​​​​  చంద్రబాబు తన పరపతితో  విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది. సాక్షులను బెదిరించి దర్యాఫ్తును ప్రబావితం చేసే ప్రమాదం ఉంది. 

👉:​​​​​​​ చంద్రబాబు రిమాండ్ తరలించి దర్యాఫ్తు సజావుగా జరిగిలే  చూడాల్సిన అవసరం ఉందని సీఐడీ కోరింది. 

👉:​​​​​​​ ఈ కేసులో అధికారులతో పాటు ఇతర సాక్ష్యులతో మరింత సమాచారం సేకరించాల్సి ఉంది. 

👉:​​​​​​​ చంద్రబాబునాయుడు తన అధికారం అడ్డుపెట్టుకుని 279కోట్ల నిధులు మాయం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. 

చంద్రబాబు వాదనలపై…

👉:​​​​​​​ కేవలం రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేసినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కక్ష్యసాధింపులో భాగంగానే అరెస్టు చేశారని వాదించారు. కాని దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలనూ చూస్తే పూర్తి సాంకేతిక ఆధారాలు సెక్షన్ 167కింద రిమాండ్ చేశారని అర్ధమవుతోంది. 

👉:​​​​​​​  రాజకీయ కక్ష్య కారణమన్నది పూర్తిగా అసంబద్ధం.

👉:​​​​​​​  ఇది అవినీతి నిరోదక శాఖ కాబట్టి సీఐడికి విచారణ పరిధిలేదన్న చంద్రబాబు వాదన సరైంది కాదు. గతంలో హైకోర్టు చాలా కేసుల్లో సీఐడికి అధికారాలున్నాయని డిక్లరేషన్ ఇచ్చింది. 

👉:​​​​​​​ అవినీతి నిరోదక కేసులను పీసీ యాక్ట్ కింద సీఐడీ నేరుగా విచారణ చేయవచ్చని  హైకోర్టు స్పష్టం చేసింది. 

👉:​​​​​​​  ప్రజాప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించి తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసి 279కోట్లను అక్రమంగా అవినీతి చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారు. 

👉:​​​​​​​  చంద్రబాబు నిందితులు సుబ్బారావు, లక్ష్మినారాయణతో కలిసి కుట్రచేసినట్లు పూర్తి ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ ఆధారలను బట్టి ఈ కేసులో సెక్షన్ ఐపీసీ 120బీ, 109 సెక్షన్లు పెట్టడం సబబే.

కుంభకోణం బయటకు ఎలా వచ్చింది?

తాము చెల్లించిన పన్నులకు సంబంధించి కొంత మొత్తం తమకు రావాలంటూ ఆదాయంపన్ను శాఖను డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ సంప్రదించింది. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు మొత్తం కూపీ లాగారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రూ.241 కోట్లు షెల్‌ కంపెనీలకు రూట్‌ అయినట్టు గుర్తించారు. దీనిపై ఆదాయంపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ఆరా తీయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.

👉:​​​​ చంద్రబాబు రిమాండ్ కాపీ పూర్తి డాక్యుమెంట్ కోసం క్లిక్ చెయ్యండి

Advertisement
Advertisement