Sakshi News home page

‘కరకట్ట నివాసం జప్తు’ వినతి పిటిషన్‌.. ఇరువైపులా ముగిసిన వాదనలు

Published Fri, Jun 2 2023 1:55 PM

cid confiscate karakatta house petition Hearings Completed ACB Court - Sakshi

సాక్షి, కృష్ణా: కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసాన్ని(లింగమనేని గెస్ట్‌హౌజ్‌) జప్తునకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సీఐడీ వాదనలు పూర్తి కాగా..  తమ వాదనలూ వినాలని లింగమనేని తరపు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. 

ఈ క్రమంలో.. లింగమనేని తరపున అడ్వొకేట్‌ అశ్వినీ కుమార్‌ ఇవాళ(జూన్‌ 2, 2023 శుక్రవారం) వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌లో సీఐడీ తరపున అడ్వొకేట్‌ వివేకానంద వాదించారు. ఇరు పక్షాల వాదనలు నేటికి పూర్తి కావడంతో జూన్‌ 6వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అదే రోజు ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. 

కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ చెబుతోంది.

ఇదీ చదవండి: చంద్రబాబు అద్దె కొంప కహానీ ఇదీ!

Advertisement

What’s your opinion

Advertisement