Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

Published Thu, Dec 21 2023 6:39 PM

CM Jagan Visits YSR Districts On December 23 To 25 Schedule Here - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రోజులపాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు, క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

23.12.2023 షెడ్యూల్‌
ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు, అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ప్రారంభించి, చైర్మన్, ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత కడప రిమ్స్‌ వద్ద డాక్టర్‌ వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దాంతోపాటు డాక్టర్‌ వైఎస్సార్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ను ప్రారంభిస్తారు.

అనంతరం అదే రిమ్స్‌ ప్రాంగణంలో డాక్టర్‌ వైఎస్సార్‌ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవం, ఆ తర్వాత ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆధునికీకరించిన కలెక్టరేట్‌ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్‌ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ ప్రారంభిస్తారు, మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు. 

24.12.2023 షెడ్యూల్‌
ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు, అనంతరం మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు, ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్క్‌లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 

25.12.2023 షెడ్యూల్‌

ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొంటారు, అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Advertisement

What’s your opinion

Advertisement