CM YS Jagan YSR District Tour Schedule - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Published Fri, Jul 7 2023 1:47 PM

Cm Ys Jagan Ysr District Tour Schedule - Sakshi

సాక్షి, అమరావతి, వైఎస్సార్‌ జిల్లా: జూలై 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకోనున్న సీఎం.. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం తిరిగి ఇడుపులపాయలో తన నివాసానికి సీఎం చేరుకోనున్నారు.

9వ తేదీ పర్యటన
రెండో రోజు పర్యటనలో భాగంగా 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకోనున్న సీఎం జగన్‌.. గండిపేట వద్ద ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ ఆఫీసు భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.

అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనం ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్‌ ఫ్రెంట్‌ చేరుకుని.. గరండాల కెనాల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌ –1 పనులను సీఎం ప్రారంభించనున్నారు. తర్వాత పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్సార్‌ ఐఎస్‌టిఏ) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్‌ బయో సైన్సెస్‌ను సీఎం ప్రారంభించున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు.
చదవండి: ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట!

10వ తేదీ పర్యటన
మూడోరోజూ  వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళ్లనున్న సీఎం.. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.
చదవండి: లోకేష్‌ ఆరోపణలు.. వేంకటేశ్వరుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్‌ ప్రమాణం

Advertisement

తప్పక చదవండి

Advertisement