Eenadu Ramoji Rao Fake News On Students Education In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

పిల్లల చదువులపై రామోజీ క్షుద్ర ‘విద్య’!

Published Tue, Jul 18 2023 4:10 AM

Eenadu Ramojirao Fake News On students Education in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పిల్లలు చక్కగా చదువుకోవడమే అంతిమ లక్ష్యం కావాలి! అందుకనే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే అర్హులందరికీ జగనన్న అమ్మ ఒడి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేలా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌సర్కారు నాలుగేళ్లలో రూ.66,722.36 కోట్లు ఖర్చు చేసింది.

ఈ ఏడాది జగనన్న అమ్మఒడి కింద అందించిన రూ.6,392.94 కోట్లతో కలిపితే ఈ ఒక్క పథకానికే ఇప్పటివరకు రూ.26,067.28 కోట్లు వ్యయం చేసింది.ప్రభుత్వ స్కూళ్లు కళకళలాడుతుంటే కొందరు పెత్తందారులు మాత్రం పేదింటి పిల్లలకు ఈ చదువులేంటని కుళ్లుకుంటున్నారు. సర్కారు స్కూళ్లలో విద్యార్థులు తగ్గిపోయారంటూ క్షుద్ర కథనాన్ని వార్చేశారు. 

► ఈనాడు లెక్కల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ 37.88 లక్షలు. ఇందులోనూ నిజం లేదు. ఇప్పటివరకు 38.22 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. ఈ ఏడాది ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. అడ్మిషన్లకు మరో నెలన్నరకు పైగా సమయం ఇంకా మిగిలే ఉంది! మరి వేల మంది పిల్లలను రామోజీ కాకి లెక్కలతో ఏం చేసినట్లు?  

► 2018–19లో ప్రాథమిక స్థాయిలో 92.91శాతంగా ఉన్న జీఈఆర్‌ 2022–23లో 100.80 శాతానికి చేరుకుంది. సెకండరీ విద్యలో 79.69 నుంచి 89.63 శాతానికి చేరింది. హయ్యర్‌ సెకండరీలో 46.88 నుంచి 69.87 శాతానికి పెరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా?  

► జీఈఆర్‌ను పెంచేందుకు టెన్త్, ఇంటర్‌ ఫెయిలైన వారికి తిరిగి ప్రవేశాలు కలి్పంచడంతో పాటు మరోసారి అమ్మఒడిని ప్రభుత్వం అందిస్తోంది.  

► పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గతేడాది టాప్‌–10 ర్యాంకులు 25 లభించగా ఈ ఏడాది 64కు పెరిగాయి. 75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్‌ సాధించిన విద్యార్థులు గతేడాది 63,275 మంది కాగా ఈ ఏడాది 67,114 మంది సత్తా చాటారు. గతేడాది 66.50 శాతం మంది ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు. 

► ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చూపారు. 67 మంది ఐఐటీ, ఎన్‌ఐటీ, నిఫ్ట్, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. మరి ఈ విషయం రామోజీ చదివారా?  

విద్యా సంస్కరణల్లో మచ్చుకు కొన్ని..
► ప్రభుత్వ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల కల్ప­నకు రూ.16,500కోట్లతో ‘మనబడి నాడు–నేడు’  
► డిజిటల్‌ విద్యను ప్రోత్సహిస్తూ బైజూస్‌ కంటెంట్‌తో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, స్మార్ట్‌ టీవీలు  
► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంతోపాటు సీబీఎస్సీతో అనుసంధానం. ఇంగ్లిష్‌­లో పావీణ్యం సాధించేలా 3వ తరగతి నుంచే ‘టోఫెల్‌’కు శిక్షణ.  
► రూ.685.87 కోట్లతో 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌ల పంపిణీ. ఏటా డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమం నిర్వహణ. 
► వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు కూడా బైజూస్‌ కంటెంట్, 45 వేల పాఠశాలల్లో ఇంటర్నెట్‌.  మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ విధానం. 

గతంలో ఇదీ దుస్థితి...
► జగనన్న అమ్మ ఒడి లేదు. స్కూళ్లు తెరిచిన 6–7 నెలలకు కూడా యూనిఫాం సంగతి దేవుడెరుగు కనీసం టెక్ట్స్‌ బుక్స్‌ కూడా అందించలేని దుస్థితి. శిథిలావస్థలో స్కూళ్లు. 
► రాగిజావ, చిక్కీ ఊసే లేదు. ఆయాల జీతాలు, సరుకుల బిల్లులు 8–9 నెలలు పెండింగ్‌లోనే.  
► గత ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778 కోట్లు (వీటిని సీఎం జగన్‌ ప్రభుత్వం వచ్చాక చెల్లించి విద్యార్థులను ఆదుకుంది) 
► విదేశీ విద్యా దీవెనలో అవకతవకలు, భారీగా బకాయిలు.   

Advertisement
Advertisement