ఆ ధైర్యం చంద్రబాబుకి ఉందా?

20 May, 2022 17:43 IST|Sakshi

తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గతంలో మాట్లాడింది ఈరోజు గుర్తుండదని, రేపు ఏమి మాట్లాడతాడో ఎవరికీ తెలియదని కర్నూల్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ విమర్శించారు. అధికారం లేకుంటే చంద్రబాబు బతకలేడని, అబద్ధాలు చెప్పకుంటే ఉండలేడని హఫీజ్‌ ఖాన్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన..‘మాకు గర్వంగా ఇంటింటికీ వెళ్ళే ధైర్యం ఉంది..చంద్రబాబుకి  ఆ ధైర్యం ఉందా..?, రేపు మా మంత్రులు కూడా జిల్లాల పర్యటన చేసి ఎవరికేం చేశామో చెప్పే శక్తి మాకుంది.

14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అంతే ధైర్యంగా చేసింది ఏమైనా చెప్పగలడా...?, ఎక్కడా గెలవలేని పుత్రుడు, దత్తపుత్రుడితో అబద్దాల ప్రచారం చేయిస్తున్నాడు. ఎక్కడా లేని సంక్షేమ ఫలాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఆ కడుపుమంట తట్టుకోలేక చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ బీసీలను చంద్రబాబు కించపరిచాడు. సురేష్ ప్రభు,  నిర్మలా సీతారామన్‌కి మీరు ఎలా సీటు ఇచ్చారు. టీజీ వెంకటేష్ వద్ద ఎంత తీసుకుని సీటు ఇచ్చావ్..?,  సుజనా చౌదరి లాంటి వారు నీకు మేధావులా ..?, సామాజిక న్యాయం చేస్తుంటే చంద్రబాబుకి బాధ...అందుకే దుష్ప్రచారం’ అని మండిపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నారనే విషయం చంద్రబాబు తెలుసుకుంటే మంచిదని హఫీజ్‌ఖాన్‌ స్పష్టం చేశారు.
చదవండి👉చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేరు: మంత్రి అంబటి

మరిన్ని వార్తలు