Oct 21st 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

Oct 21st 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sat, Oct 21 2023 7:13 AM

Oct 21 Chandrababu Naidu Arrest Cases Remand Political Updates - Sakshi

Chandrababu Naidu Arrest Remand & AP Political Updates

తూర్పుగోదావరి జిల్లా.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై 9వరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు 

నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం

బీ పీ 130/80

పల్స్..71/మినిట్

రెస్పిరేటరీ రేటు...13/మినిట్

ఎస్ పీ ఓటు...97శాతం

ఫిజికల్ యాక్టివిటీ... గుడ్

లంగ్స్... క్లియర్

ఆర్ బీ ఎస్..138 mg/dl

7:00 PM, అక్టోబర్‌ 21, 2023
ఇంతకీ.. చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడిందెవరు?

► తెలుగుదేశం మీటింగ్ లో లోకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఎల్లో మీడియా
► నా తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు తెలియదు : లోకేష్‌
► గవర్నర్‌ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు : లోకేష్‌
► ఇప్పుడు నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ విమర్శిస్తున్నారు : లోకేష్‌
► నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని చెబుతున్నారు : లోకేష్‌
► మరీ జైల్లో క్షేమంగా ఉన్న చంద్రబాబుపై సానుభూతి కోసం మీరేం ప్రచారం చేశారు?
► 
జైల్లో కేజీ బరువు పెరిగినా.. కొంపలు మునిగిపోతున్నాయంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాయించింది ఎవరు?
► మా నాన్నకు స్టెరాయిడ్‌లు ఇస్తున్నారు.. ఆయన ఆరోగ్యం ఏమై పోవాలి అంటూ దొంగ ఏడ్పులు ఏడ్చింది ఎవరు?
► మా భర్త చంద్రబాబు కిడ్నీలకు ప్రమాదం ఉందని ప్రకటనలు చేసిన భువనేశ్వరీకి డైరెక్షన్‌ ఎక్కడిది?
► దోమలు, చన్నీళ్లు, ఏసీలు అంటూ లేనివన్ని ఎందుకు అంటగట్టారు?
► ఎప్పటినుంచో ఉన్న స్కిన్‌ ఎలర్జీని హఠాత్తుగా తెరపైకి ఎందుకు తెచ్చారు?
► ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు అచ్చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందనుకున్నారా?
► మీరు ప్రారంభించిన విష క్రీడ మీ వరకు వచ్చేసరికి మీకు బాధ కలిగిందా?
► ఇంకెన్నాళ్లు జనాల ముందు అసత్యాలు, అబద్దాలు వల్లె వేస్తారు?

6:50 PM, అక్టోబర్‌ 21, 2023
అయ్యా.. మీరు పాటిస్తున్న సిద్ధాంతమేంటీ? చెబుతున్న నీతులేంటీ?

► పబ్లిక్‌ మీటింగ్‌ల్లో దిగజారి బ్యాడ్‌ ఎగ్జాంపుల్‌గా నిలిచిన పవన్‌ కళ్యాణ్‌
► ఇటీవల జనసేన మీటింగ్‌లో చెప్పులు చూపించిన పవన్‌ కళ్యాణ్‌
► తీవ్ర విమర్శలు రావడంతో కొత్త సిద్ధాంతం వల్లె వేస్తోన్న పవన్‌
► అధికార ప్రతినిధులు జాగ్రత్తగా మాట్లాడాలి : పవన్‌
► కులాలు, మతాల గురించి పరిమితులకు లోబడి మాట్లాడాలి : పవన్‌
► రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి కానీ నోరు జారొద్దు : పవన్‌
► అధికార ప్రతినిధుల కోసం వచ్చే నెలలో వర్క్ షాప్ ఏర్పాటు: పవన్ కల్యాణ్

6:35 PM, అక్టోబర్‌ 21, 2023
ఓటుకు కోట్లు దొంగలు వాళ్లు

► తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి
► కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి హరీష్ రావు
► ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగ మాటలు చెబుతున్నారు
► బిజెపితో పోరాటం మా DNAలో ఉంది అని రాహుల్ గాంధీ అన్నారు. మరి రేవంత్ రెడ్డి DNAలో ఏముంది?
► రేవంత్ DNAలో టిడిపి ఉందా? కాంగ్రెస్ ఉందా? 
► రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి DNA మ్యాచ్ కావడం లేదు
► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి
 

6:14 PM, అక్టోబర్‌ 21, 2023
ఇంతకీ తెలంగాణలో టిడిపికి ఎంత సీను?

► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా
► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా?
► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్‌ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి?
► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150  డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు?  
► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్‌ నియోజకవర్గం
► 2021లో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714  (మే 3,  2021 ) 
► ఇక్కడ మొత్తం పోల్ అయిన  ఓట్లు -1 .91  లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం  లోపే (1 ,714)
► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు?
► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా?
► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు?
► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా?

5:44 PM, అక్టోబర్‌ 21, 2023
మన పొత్తు ఎవరితో? జనసేనలో అనుమానాలు

► జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ భేటీ
► హాజరైన 21 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు 
► అసలు జనసేన పార్టీ ఎవరితో పొత్తు అని పార్టీలో ప్రశ్నలు
► అధికారికంగా బీజేపీతో కొనసాగుతున్న ఒప్పందం
► రాజమండ్రి జైలు ముందు టిడిపితో పొత్తు అని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌
► ఇంతకీ జనసేన పొత్తు బీజేపీతోనా? టిడిపితోనా?
► ఒక వేళ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు మిగిలే సీట్లు ఎన్ని?
► అసలు జనసేన తరపున ఖర్చు పెట్టుకోవాలా లేదా అన్నదానిపై అభ్యర్థుల్లో సందేహాలు

5:20 PM, అక్టోబర్‌ 21, 2023
తెలంగాణలో బీజేపీతో, ఏపీలో సైకిల్ తో

► హైదరాబాద్ : బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన
► జనసేనకు కేటాయించే స్థానాలపై బీజేపీలో దాదాపుగా స్పష్టత
► కూకట్ పల్లి, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, ఇల్లందు, మధిర
► కొత్తగూడెం, అశ్వరావుపేట, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, కోదాడ  కేటాయించే ఛాన్స్
► ముందు 36 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్
► 36 కాస్తా 12కు వస్తాయా అన్న అనుమానాలు
► పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టలేదని పార్టీలో ప్రశ్న
 

5:05 PM, అక్టోబర్‌ 21, 2023
రాజమండ్రికి బ్రేక్

►రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు భువనేశ్వరి, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ
►ములాఖత్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ కు కుటుంబ సభ్యులు
►నాలుగు రోజుల్లో చంద్రగిరికి వస్తానని చెప్పిన భువనేశ్వరీ

4:45 PM, అక్టోబర్‌ 21, 2023
ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ? 

► నవంబర్ 1 నుంచి లోకేష్‌ ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ 
► ఎవరూ పట్టించుకోకపోవడంతో గద్గద స్వరంతో లోకేష్‌ స్పీచ్‌లు
► నిన్నటిదాకా పీxxx అన్న లోకేష్‌ ఇప్పుడు సానుభూతి కోసం గేమ్‌లు
► ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేందుకు బస్సు యాత్రలు చేస్తున్నావు?
► ముందు నువ్వు ఎమ్మెల్యే కావడానికి గ్యారంటీ ఉందా?
► మీ పార్టీ పొత్తుల్లేకుండా సింగిల్‌గా పోటీ చేస్తుందన్న గ్యారంటీ ఉందా?
► ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించే మ్యానిఫెస్టో మాయం చేయబోరన్న దానికి గ్యారంటీ ఉందా?
► ఇచ్చిన ఏ హామీలోనైనా నిలబడడానికి గ్యారంటీ ఉందా?
► హెరిటేజ్‌ కోసం ప్రభుత్వ డెయిరీలు మూసివేయబోమన్నదానికి గ్యారంటీ ఉందా?
► అసలు ప్రజల ముందుకెళ్లి నాకు ఇందుకోసం ఓటు వేయండని చెప్పే గ్యారంటీ ఉందా?
► ఏం ఉద్ధరించారని ఓటేయాలని మిమ్మల్ని అడిగితే పారిపోకుండా ఉంటారని గ్యారంటీ ఉందా?
► బయటపడ్డ అన్ని స్కాంల్లో తప్పు చేయలేదని కోర్టు ముందు చెప్పుకోలేని మీ తీరుకు ఏం గ్యారంటీ?
► మేనేజర్‌ తప్పు చేస్తే ఓనర్‌ను పట్టుకుంటారా అంటూ డొంక తిరుగుడు మాటలు చెప్పవని గ్యారంటీ ఏంటీ?
► మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించి బేరాలు సాగించబోరన్నదానికి గ్యారంటీ ఉందా?

4:20 PM, అక్టోబర్‌ 21, 2023
రంగంలోకి భువనేశ్వరీ.. నిజంగా నిజమే చెబుతారా?

► చంద్రగిరి నుంచి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి 
► మహిళల్లో సానుభూతి కోసం భువనేశ్వరీని రంగంలోకి దించిన బాబు
నిజమే.. నిజం గెలవాలి, భువనేశ్వరీ నిజం చెప్పాలంటున్న YSRCP
► ఎన్టీఆర్‌ నుంచి  చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి
► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి
► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి
► వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌, మన వాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి
► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి
► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి
► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి
► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని హెరిటేజ్ పేరిట ముందే ఏ రకంగా భూములు కొన్నారో నిజం చెప్పాలి
► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి
► స్కిల్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి
► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి

3:35PM, అక్టోబర్‌ 21, 2023
టీడీపీ, నారా లోకేష్‌లకు ఇక భవిష్యత్‌ లేదు: మంత్రి ఆదిమూలపు సురేష్‌

►టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటే 48 గంటల్లో విడిపిస్తా అని.లోకేష్ అన్నాడు
►వాళ్ళ నాన్న జైలుకి వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు బెయిలు తేలేకపోయాడు
►పాపం పండిపోయి చంద్రబాబు జైలుకి వెళ్లారు
►యువగళం యాత్ర ఎందుకు లోకేష్ ఆపేశాడు
►ఏ యాత్ర చేసిన టీడీపీ, లోకేష్‌లకు భవిష్యత్‌ లేదని తేలిపోయింది

2:30PM, అక్టోబర్‌ 21, 2023
చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్‌ ఫైర్‌
►అవినీతి చేయడంలో చంద్రబాబు కాకలు తీరిన యోధుడు
► చంద్రబాబు రాష్ట్రాన్ని లూఠీ చేశారు.. అవినీతిని  విశృంఖలం చేశారు
►చంద్రబాబు,లోకేష్‌ తోడు దొంగలు
►బాబు అవినీతి సామ్రాజ్యం...అక్రమాస్తుల మీద సీబీఐ విచారణ కోరే సత్తా ఉందా?
►బాబును అరెస్ట్‌ చేసి నంద్యాల నుంచి విజయవాడ తెస్తే ఒక్కడూ కూడా వెంట రాలేదు
►చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు
►చంద్రబాబు ఏనాడైనా ఎవరికైనా అండగా నిలిచారా?
►మీ పార్టీ పెత్తందారుల పార్టీ కాబట్టే ఎవ్వరూ మీకు మద్దతివ్వడం లేదు
►ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?
►చేతగాని చవట సన్నాసులందరూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు
►పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు
►చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు
►చంద్రబాబు అందరివాడు కాదు
►మా వాడు అని ఆయన సామాజికవర్గం వారు చెప్పుకుంటున్నారు
►పెత్తందార్ల పక్షాన నిలబడి పేదలను విస్మరించినందునే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు
►గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది
►పెత్తందారుల పక్షాన పవన్‌ పాలేరులా మారాడు
►ఇంగ్లిష్‌ మీడియంపై పవన్‌ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు
►సీఎం జగన్‌ పరిపాలన ఒక సువర్ణయుగంగా ఉందని ప్రజలే చెబుతున్నారు

1:00 PM, అక్టోబర్‌ 21, 2023
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్‌
►రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబుతో ములాఖత్ 
►ములాఖత్‌లో చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు
►చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, రామకృష్ణ

అక్టోబర్‌ 21, 2023, 11:57 AM
న్యాయవ్యవస్థకు ఓ తలనొప్పిగా చంద్రబాబు
సోషల్‌ మీడియాలో విజయసాయిరెడ్డి సూటి ప్రశ్నలు
►న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతున్నారు 
►పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తున్నారు 
►మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం
►ఇవన్నీ వింతే కదా?
►ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు
►వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి
►ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం
►పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు
►న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉంది
►మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు?
►వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా?

అక్టోబర్‌ 21, 2023, 11:50 AM
అన్ని పిటిషన్లు విచారణ వాయిదా!

►స్కిల్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు నవంబర్‌ 8న
►ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ నవంబర్‌ 9న
►ఫైబర్‌నెట్‌ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్‌ 10న  
►కాల్‌ డేటా రికార్డింగ్‌(సీడీఆర్‌) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా
►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు
►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్‌ బెంచ్‌కు  బెయిల్ పిటిషన్

అక్టోబర్‌ 21, 2023, 10:58 AM
అసాంఘిక శక్తులకు గుణపాఠం నేర్పాలి
పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్‌ వ్యాఖ్యలు

►నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి.
►తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి.
►ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి.
►అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది.

అక్టోబర్‌ 21, 2023, 10:40 AM
టీడీపీ దృష్టిలో పవన్‌ వాడిపడేసే వస్తువు
మంత్రి చెల్లుబోయిన వేణు కామెంట్స్

►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
►రాజకీయ విలువలకు పవన్‌ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
►తెలంగాణలో బీజేపీతో పొత్తు,  ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతం?
►పవన్‌ను టీడీపీ ఒక టూల్‌గా టీడీపీ వాడుకుంటోంది
►కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం
►ముద్రగడను చంద్రబాబు తీవ్రక్షోభకు గురి చేశారు
►మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికే చంద్రబాబు ప్రయత్నం
►చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలి
►చంద్రబాబు శకం ముగిసింది
►చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నారు
►దేశంలోని చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో బాబు ఉన్నారు
►18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకి నేడు బెయిల్ రావడం లేదు
 

అక్టోబర్‌ 21, 2023, 08:35 AM
ముందు స్కిల్‌.. ఆ తర్వాతే ఫైబర్‌నెట్‌
►ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన చంద్రబాబు నాయుడు
► స్కిల్‌డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో క్వాష్‌ పిటిషన్‌ విచారణ చేపట్టిన ధర్మాసనం ముందుకే.. ఫైబర్‌నెట్‌ పిటిషన్‌ కూడా 
►ముందు స్కిల్‌ స్కామ్‌ పిటిషన్‌ తీర్పు వెల్లడిస్తామన్న ద్విసభ్య ధర్మాసనం
►ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నవంబర్‌ 9కి వాయిదా

అక్టోబర్‌ 21, 2023, 07:56 AM
రాజమండ్రిలో పవన్‌-లోకేష్‌ భేటీ
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►ప్రతిరోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు
►చంద్రబాబుతో ఇవాళ మరోసారి ములాఖత్ కానున్న కుటుంబ సభ్యులు
►ప్రజా స్పందన లేకపోవడంతో నిలచిపోయిన టిడిపి దీక్షలు
►జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కోసం సిద్ధమవుతున్న టీడీపీ
►ఈనెల 23న రాజమండ్రిలో పవన్ కల్యాణ్, లోకేష్ భేటీ

అక్టోబర్‌ 21, 2023, 07:24 AM
మనసంతా బాబే
► తెలంగాణ ప్రచారంలో బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబేనంటున్న నెటిజన్లు
► తన గురువు చంద్రబాబు జైల్లో ఉండడంతో ప్రచారంలో నీరసంగా కనిపిస్తోన్న రేవంత్
► కీలక సమయంలో తనకు గురువు నుంచి సూచనలు లేకపోవడంతో బాధలో రేవంత్

అక్టోబర్‌ 21, 2023, 07:20 AM
నేడు తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశం 
► ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యలయంలో ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం
► చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రజలకు ఏం చెప్పాలన్నదానిపై చర్చ
► జనసేన, తెలుగుదేశం సమన్వయం ఎలాగన్నదానిపై చర్చ
► భువనేశ్వరీ కార్యక్రమం నిజం గెలవాలి కార్యక్రమంపై వివరించనున్న లోకేష్‌
► యువగళం ఎందుకు నిలిపివేశామన్న దానిపై పార్టీ నేతలకు వివరించనున్న లోకేష్‌
► బాబు ష్యూరిటీ యాత్రను బస్సులో తానే నిర్వహిస్తానంటున్న లోకేష్‌
► పాదయాత్ర చేసేకంటే బస్సులో యాత్ర బెటరన్న ఆలోచనలో లోకేష్‌

అక్టోబర్‌ 21, 2023, 07:18 AM
నేడు బాబుతో ములాఖత్
► నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యులు, ముఖ్యనేతల ములాఖత్
► మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు
► చంద్రబాబుతో ములాఖత్ కానున్న నారా లోకేష్, భువనేశ్వరి, టీడీపీ నేతలు 

అక్టోబర్‌ 21, 2023, 07:08 AM
స్కిల్‌ కేసులో చంద్రబాబు
►చంద్రబాబు నాయుడిపై స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు
►స్కిల్‌ స్కామ్‌లో కింది కోర్టుల్లో దక్కని ఊరట
►ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత
► హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీం కోర్టులో క్వాష్‌ పిటిషన్‌
► గవర్నర్‌ అనుమతి లేకుండా అరెస్ట్‌ చేశారంటూ.. 17ఏని వర్తిస్తుందంటూ చంద్రబాబు తరపు లాయర్ల వాదన
► నేరం జరిగిన నాటికి 17ఏ సెక్షన్‌ లేదని.. కేసు కీలక దశలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సర్వోన్నత న్యాయస్థానానికి ఏపీ సీఐడీ విజ్ఞప్తి
►వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్‌ చేసిన ద్విసభ్య ధర్మాసనం
►నవంబర్‌ 8న తీర్పు

అక్టోబర్‌ 21, 2023, 07:05 AM
చంద్రబాబు రిమాండ్‌ @42

► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌
► నంద్యాలలో సెప్టెంబర్‌ 9వ తేదీన అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్‌ 10న రిమాండ్‌ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం
► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో 42వ రోజుకి చేరిన జ్యుడీషియల్‌ రిమాండ్
► 7691 నెంబర్‌తో రిమాండ్‌ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి 
►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్‌ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి
►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు
►తాజాగా.. ఐదోసారి జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు
►నవంబర్‌ 1వరకు రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు

Advertisement
Advertisement