బాబూ.. ఇదేం బరితెగింపు: సజ్జల

1 Nov, 2023 20:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ: స్కిల్ స్కాం సహా పలు కేసుల్లో చంద్రబాబే అసలు నేరస్థుడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోర్టు అన్ని ఆధారాలతో చంద్రబాబును రిమాండ్‌కు పంపిందన్నారు. బరి తెగింపుతో మేం ఇంతే అనేలా చంద్రబాబు ప్రవర్తించారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోమని కోర్టు చెబితే..రూట్‌మ్యాప్‌ వేసుకుని చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ అయితే లోకేష్‌ ఢిల్లీలో ఉండి తల్లిని బయటికి పంపిస్తున్నారు. లోకేష్‌ తప్పుకున్నారా? చంద్రబాబు తప్పించారా?. చంద్రబాబు ముందు తన ఇంటి పంచాయితీ తేల్చుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘2019లోనే యుద్ధం ముగిసింది. ఇంకెవరైనా మిగిలుంటే 2024లో చూసుకుంటాం. దత్తపుత్రుడితో కలిసి వచ్చినా చంద్రబాబు గెలవరు. రోగి అని చెప్పిన వ్యక్తి యోగిలా ఎందుకు హడావిడి చేస్తున్నారు. రెండున్నర గంటలు పట్టే సమయం.. 14 గంటలు ఎందుకు జరిగింది?. చంద్రబాబు అనారోగ్య కారణాలతో బయటకు వచ్చి పోరాటం ద్వారా వచ్చినట్టు చెప్తున్నారు. న్యాయస్దానాన్ని కూడా చంద్రబాబు తప్పుదారి పట్టించారు. న్యాయస్థానం చెప్పినా బరి తెగింపుతో మేము ఇంతే అనేలా చంద్రబాబు ప్రవర్తించారు. చంద్రబాబు పూర్తిగా బరి తెగించారు. ఆయన ఈ జన్మలో మారరు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.
చదవండి: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు 

మరిన్ని వార్తలు