స్థానిక ఎన్నికల్లో కుంపట్లు  రాజేస్తున్న ‘తమ్ముళ్లు’  | Sakshi
Sakshi News home page

టీడీపీ కట్టుకథలు!

Published Fri, Feb 5 2021 9:20 AM

TDP Kidnap Drama In Ananthapur Exposed - Sakshi

సాక్షి, అనంతపురం : పార్టీకి  సంబంధం లేని పంచాయతీ ఎన్నికలకు టీడీపీ రాజకీయ రంగు పులుముతోంది. ఏ చిన్న సంఘటన జరిగినా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకి లింకు పెట్టి విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. కనీస విచారణ చేసుకోకుండానే పచ్చని పల్లెల్లో నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కట్టుకథలకు గట్టి ఎదురుదెబ్బే తగులుతోంది. పోటీలో నిలిస్తే ఖర్చు భరిస్తామని హామీ ఇస్తున్నప్పటికీ అభ్యర్థులు విత్‌డ్రా చేసుకుంటుండటంతో దిక్కుతోచని ‘తమ్ముళ్లు’ కిడ్నాప్‌ డ్రామాలకు తెరలేపుతుండటం గమనార్హం. 

 రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మక్కపల్లి పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసిన తిమ్మక్క భర్త ఈరన్న.. తనను మొలకాల్మూరు వద్ద నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని, వారి నుంచి తప్పించుకువచ్చానని ఫిర్యాదు చేశారు. దీనిపై మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుతో పాటు ఏకంగా చంద్రబాబు కూడా సదరు అభ్యర్థికి ఫోను చేశారు. ఇవన్నీ అధికార పార్టీ దౌర్జన్యాలంటూ మండిపడ్డారు. అయితే, పోలీసుల విచారణలో అసలు ఆయన కిడ్నాపే కాలేదని తేలింది. అంతేకాదు ఆర్థిక సమస్యలతో పోటీ నుంచి తప్పుకునేందుకు డ్రామా ఆడారని తేలింది.   కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం తుమ్మలబైలు పెద్దతండకు చెందిన కృష్ణానాయక్‌ను కిడ్నాప్‌ చేశారంటూ టీడీపీ నేతలు నానాయాగీ చేశారు. అయితే, తనను ఎవ్వరూ కిడ్నాప్‌ చేయలేదని.. గ్రామస్తులు సహకరించే పరిస్థితి లేనందువల్లే పోటీ నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇదేతరహాలో కట్టుకథలతో పంచాయతీ ఎన్నికల్లో పోట్లాటలు రాజేసేందుకు టీడీపీ నేతలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. 

 అటు రాయదుర్గం.. ఇటు కదిరిలో కూడా పోటీ చేసే అభ్యర్థులకు టీడీపీ తాయిలాలు ఎరవేసినట్టు తెలుస్తోంది. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మక్కపల్లి పంచాయతీకి పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసిన తిమ్మక్క భర్తకు టీడీపీ నేతలు ఆర్థికంగా సహాయం చేస్తామని మొదట హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నామినేషన్‌ వేసిన తర్వాత పట్టించుకోకపోవడంతో కిడ్నాప్‌ డ్రామాకు తెరలేపినట్టు తెలుస్తోంది. తమ ఇంటి దైవాన్ని దర్శించుకునేందుకు మొలకాల్మూరుకు వెళ్లగా.. అక్కడ నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదు చేశారు. అయితే, తాను ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్నానని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే, పోలీసులు కాస్తా పాయింట్‌ టు పాయింట్‌ విచారణ చేయడంతో పాటు సెల్‌ఫోన్‌ లోకేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేయడంతో ఇదంతా డ్రామా అని తేలింది.

అసలు మొలకాల్మూరు రద్దీ ప్రాంతం అని.. ఇక్కడ అలాంటి సంఘటన జరగలేదని స్థానికులు తేల్చారు. మరోవైపు తాను పూజారిని 10 గంటలకు కలిశానని సదరు వ్యక్తి చెప్పగా.. 2 గంటలకు కలిశాడని పూజారి చెప్పారు. మొత్తంగా ఆర్థిక సహాయం చేస్తామని నమ్మించి నామినేషన్‌ వేయించిన టీడీపీ నేతలు.. చివరకు హ్యాండ్‌ ఇవ్వడంతో ఈ డ్రామాకు తెరలేపినట్టు తెలుస్తోంది. కదిరి నియోజకవర్గంలోనూ ఇదే జరిగింది. ఇక్కడ కూడా కిడ్నాప్‌ జరిగిందంటూ కదిరి టీడీపీ ఇన్‌చార్జి కందికుంట నాటకానికి ప్రయతి్నంచారు. చివరకు సదరు అభ్యర్థే తనను కిడ్నాప్‌ చేయలేదనడంతో కందికుంట డ్రామాకు తెరపడింది. మొత్తంగా టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాలు కాస్తా జిల్లా ప్రజానీకానికి తేటతెల్లమవుతున్నాయి.  

ఆడలేక మద్దెల ఓడినట్టు...! 
స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. టీడీపీ నేరుగా మద్దతు ఇస్తున్నట్టు పలువురు అభ్యర్థులకు తాయిలాలను ప్రకటిస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామని ఆఫర్లు ఇస్తోంది. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు కరువవుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని చోట్ల టీడీపీ నుంచి ఒత్తిడితో కొద్ది మంది పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీలకు పార్టీ రంగుపులిమిన టీడీపీ.. ఎలాగైనా రచ్చచేయాలనే ధోరణితో ముందుకు పోతోంది. ఆడలేక మద్దెల ఓడినట్టు కిరికిరి చేసేందుకు యతి్నస్తోంది. ప్రజల్లో లేని భయాన్ని సృష్టించేందుకు ప్రయతి్నస్తోంది. తద్వారా పచ్చని పల్లెల్లో పోటీలు పెట్టి నిప్పులు రాజేసేందుకు ప్రయతి్నస్తోంది. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉంటూ.. టీడీపీ నేతల రాజకీయాలకు రెచ్చిపోకుండా అభివృద్ధి వైపు మొగ్గుచూపుతుండటం విశేషం.  

కిడ్నాప్‌లన్నీ కట్టుకథలే 
రాప్తాడు: జిల్లాలో నమోదైన రెండు కిడ్నాప్‌ కేసులు కట్టుకథలుగా తేలిందని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. బొమ్మక్కపల్లి పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి బోయ తిమ్మక్క భర్త ఈరన్న, గాండ్లపెంట మండలం తుమ్మలబైలు పెద్దతండా సర్పంచ్‌ అభ్యర్థి కృష్ణానాయక్‌లను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, ఆ కిడ్నాప్‌ ఉదంతమంతా కట్టుకథ అన్నారు. గురువారం ఆయన రాప్తాడులో మీడియాతో మాట్లాడారు. బొమ్మక్కపల్లి పంచాయతీ సర్పంచ్‌ అభ్యరి్థగా ఈరన్న భార్య తిమ్మక్క బరిలో నిలిచారని, అయితే కుటుంబీలు మద్దతు ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఈరన్న కర్ణాటకకు వెళ్లి తిరిగి వచ్చినట్లు తేలిందన్నారు. ఇక తుమ్మలబైలు పెద్దతండా సర్పంచ్‌ అభ్యర్థి కృష్ణానాయక్‌ను కిడ్నాప్‌ చేశారని భార్య ఫిర్యాదు చేయగా , తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తానే స్వచ్ఛందంగా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని కృష్ణానాయక్‌ చెప్పాడన్నారు. 

Advertisement
Advertisement