Increasing Number Of Girls In AP: Union Ministry Report - Sakshi
Sakshi News home page

రావమ్మా మహాలక్ష్మి.. ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య 

Published Wed, Jul 5 2023 7:58 AM

Union Ministry Report: Increasing Number Of Girls In Ap - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. కానీ..  2021 తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శా­ఖ తాజా నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తికి సంబంధించి 2021– 22 నివేదిక లో ఈ విషయాలను వెల్ల­డించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మా­యిలు మా­త్ర­మే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 1,046కు పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది. 

ఆరోగ్య కార్యక్రమాల అమలు భేష్‌ 
రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు బాగా అమలు చేస్తుండటం వల్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఆరే ళ్లు నిండకముందే బాలికల్లో ఆరో­గ్య సమస్యలు తలెత్తి మృతి చెందేవారు. కానీ.. ఈ పరిస్థితులు తలెత్తకుండా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా యాంటీనేటల్‌ చెక­ప్, వ్యాధి నిరో ధక టీకాల అమలు అద్భుతంగా ఉండటం వంటి  పరిస్థితుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల స్థాయిలోనే ఆరోగ్య సేవ­లు అందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ వ్యవస్థ కూడా సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మాయిల సంఖ్య పెరగడానికి ఇవి కూడా కారణాలని నివేదిక వెల్లడించింది.
చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం

కేరళ తర్వాత ఏపీలోనే అధికం
దేశంలో అమ్మాయిలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉండటం గమనార్హం. కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 1,046 మంది నమోదయ్యారు. అత్యల్పంగా హర్యానాలో 887 మంది అమ్మాయిలు మాత్రమే నమోదయ్యారు. ఏపీలో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,063 మంది, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,038 మంది అమ్మాయిలు ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. 98 శాతం ప్రసవాలు ఆస్పత్రు­ల్లోనే జరుగుతుండటం వల్ల మెరు­గైన ఫలితాలు వస్తున్నాయ­ని వివరించారు. ఇండియాలో సగటున ప్రతి వెయ్యిమంది అబ్బా­యిలకు 968 మంది అమ్మాయి­లు నమోదయ్యారు. 

Advertisement
Advertisement