‘వికేంద్రీకరణ దిశగా ముందుకెళ్తాం’ | Sakshi
Sakshi News home page

‘వికేంద్రీకరణ దిశగా ముందుకెళ్తాం’

Published Mon, Nov 28 2022 9:11 PM

We Stand For Decentralization YSRCP Leaders - Sakshi

విజయవాడ: అభివృద్ధి ఒకే చోట కేంద్రీకరించడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనేదే సీఎం జగన్‌ సంకల్పమన్నారు.  వికేంద్రీకరణ దిశగా ముందుకెళ్తామని మంత్రి ఆదిమూలపు తెలిపారు.

సుప్రీం వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నాయి
రాజధాని అంశానికి సంబంధించి సుప్రీం వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమరావతిపై తమ ప్రభుత్వం ఎప్పుడూ యూటర్న్‌ తీసుకోలేదన్నారు. రైతులతో చేసుకున్న ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు బొత్స.

Advertisement
Advertisement