Horoscope Today: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..

Published Fri, Apr 5 2024 4:45 AM

Daily Horoscope: Rashi Phalalu On April 5th 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.9.55 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ధనిష్ఠ ప.3.05 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.9.49 నుండి 11.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.09 వరకు,తదుపరి ప.12.28 నుండి 1.16 వరకు,అమృతఘడియలు: ఉ.5.56 నుండి 6.47 వరకు. 

మేషం: ఆకస్మిక  ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఉన్నతి.

వృషభం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: చేపట్టిన కార్యాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

సింహం: శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య: ఇంటాబయటా అనుకూలం. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగలాభం. కార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: కొత్తగా రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

వృశ్చికం: కుటుంబసభ్యులతో కలహాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

Advertisement
Advertisement