ఈ రాశివారి వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశివారి వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి

Published Wed, Jan 12 2022 6:23 AM

Today Horoscope In Telugu 12-01-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.దశమి సా.6.33 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం భరణి సా.4.10 వరకు, తదుపరి కృత్తిక వర్జ్యం తె.5.16 నుండి 7.01 వరకు (తెల్లవారితే గురువారం) దుర్ముహూర్తం ప.11.45 నుండి 12.29 వరకు అమృతఘడియలు... ఉ.10.58 నుండి 11.44 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.39
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:

మేషం... కార్యజయం. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చెప్పుకోతగిన అభివృద్ధి.

వృషభం... సన్నిహితులు, మిత్రులతో కలహాలు. కొత్త రుణాన్వేషణ. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కర్కాటకం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

కన్య... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

తుల... ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసమస్యల నుంచి విముక్తి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు.

వృశ్చికం... నూతన పరిచయాలు. ఆశయసాధనలో ముందడుగు వేస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు... పనులలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు తప్పవు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మకరం... సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

కుంభం... యత్నకార్యసిద్ధి. కుటుంబంలో కొన్ని వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మీనం... వ్యవహారాలు నిదానిస్తాయి. బంధువుల నుంచి సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

Advertisement
Advertisement