ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు

Published Fri, Dec 24 2021 6:03 AM

Today Horoscope Telugu 24-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.పంచమి ప.3.51 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం మఖ రా.1.06 వరకు, తదుపరి పుబ్బ వర్జ్యం ప.12.38 నుండి 2.16 వరకు, దుర్ముహూర్తం ఉ.8.43 నుండి 9.23 వరకు, తదుపరి ప.12.20 నుండి 1.04 వరకు అమృతఘడియలు... రా.10.36 నుండి 12.25 వరకు.

సూర్యోదయం :    6.31
సూర్యాస్తమయం     :  5.28
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 


మేషం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

వృషభం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది.  ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం: సన్నిహితులతో సఖ్యత. పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. పనులు ముందుకుసాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు విస్తరణ వాయిదా. ఉద్యోగాల్లో ఒత్తిడులు.

తుల: సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలుల, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మకరం: రుణయత్నాలు. కుటుంబంలో బాధ్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తు, వస్త్రలాభాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

Advertisement
Advertisement