14 గ్రానైట్‌ లారీల పట్టివేత | Sakshi
Sakshi News home page

14 గ్రానైట్‌ లారీల పట్టివేత

Published Fri, Mar 17 2023 2:10 AM

- - Sakshi

కారెంపూడి: అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్న 14 లారీలను పట్టుకుని తగు చర్యల నిమిత్తం దాచేపల్లి మైన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు అప్పగించామని ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కారెంపూడి సమీపంలోని శ్రీచక్ర సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద, కారెంపూడిలో, మా చర్ల సాగర్‌ రోడ్డులో బుధవారం రాత్రంతా నిఘా పెట్టి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్‌ లారీలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుకున్న వాటిలో 13 లారీలలోని గ్రానైట్‌కు మైనింగ్‌ ట్రాన్సిట్‌ పాసులు లేవని, మరో లారీకి ఈ వే బిల్లు లేకుండా వెళ్తున్నాయని పేర్కొన్నారు. గ్రానైట్‌ లారీలు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి కారెంపూడి మీదగా ఏవిధమైన బిల్లులు లేకుండా హైదరాబాదు, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు అక్రమంగా తరలిపోతున్నాయని అందిన సమాచారం మేరకు నిఘా పెట్టి ఈ గ్రానైట్‌ లారీలను పట్టుకున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement