Sakshi News home page

కనుల పండువగా లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ల

Published Tue, Mar 26 2024 2:05 AM

అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే కాసు, 
అనిల్‌ కుమార్‌ యాదవ్‌   - Sakshi

● ఎమ్మెల్యే కాసు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పూజలు ● స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ

దాచేపల్లి : స్థానిక ముత్యాలంపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామి తిరునాళ్ల మహోత్సవం సోమవారం కన్నుల పండువగా జరిగింది. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఆలయ పూజారి నల్లజర్ల నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి వార్షిక కల్యాణం కన్నుల పండువగా జరిపించారు. అనంతరం కుంకుమ బండ్లను ఊరేగించారు.

పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి తిరునాళ్ల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు అంబటి ఆంజనేయులు నివాసం నుంచి అమ్మవారి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తీసుకెళ్లారు. మేళ తాళాలతో పట్టు వస్త్రాలను ఊరేగించిన పిదప అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే కాసు, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ కొప్పుల సుబ్బమ్మ, పార్టీ నేత కొప్పుల సాంబయ్య, మాజీ పట్టణ కన్వీనర్‌ మునగా పున్నారావు, రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుముల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ కటకం జయశ్రీ,, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు షేక్‌ సుభానీ, కోట కృష్ణ, మాజీ సర్పంచ్‌ మందపాటి రమేష్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కందుల జాను, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మునగా నిమ్మయ్య, నాయకులు దాచేపల్లి సైదారావు, షేక్‌ ఖాదర్‌ భాషా, మునగా శ్రీనివాసరావు, కుందురు తిరుపతి రెడ్డి, పానాది వెంకట నారాయణ, మహేష్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement