'Sustainable Innovation': Video of 7-seater solar vehicle made from scrap impresses Harsh Goenka - Sakshi
Sakshi News home page

సెవెన్‌ సీటర్‌ బైక్‌ : ఇది కదా.. మేకిన్‌ ఇండియా అంటే..

Published Wed, May 3 2023 4:43 PM

7 Seater Solar Vehicle Made From Scrap - Sakshi

మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు ఔత్సాహిక వేత్తలు.పెద్దగా చదువుకోకున్నా, టెక్నాలజీ గురించి తెలియకపోయినా.. పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న అవసరాలు తీర్చుకునేందుకు సరికొత్త దారులు వెతుకుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో చూస్తే.. ఆశ్చర్యపోతాం. తమ అవసరాలు తీర్చుకునేందుకు ఓ యువకుడు అత్యంత చౌకగా సోలార్‌ బైక్‌ను రూపొందించుకున్నాడు.

మార్కెట్‌లో దొరికే వివిధ వస్తువులను ఉపయోగించి ఏకంగా సెవెన్‌ సీటర్‌ బైక్‌ తయారు చేశాడు. ఈ ఆవిష్కరణపై ప్రశ్నించినప్పుడు ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. "ఈ బైక్‌పై ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. పైగా ఇది సోలార్‌ తో నడుస్తుంది. దీనిపై 200 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. దీన్ని తయారు చేయడానికి 8 నుంచి 10వేల దాకా ఖర్చు వచ్చింది. చూశారుగా నా సోలార్‌ బైక్‌"

నిజమే.. భారత్‌ లాంటి ఎదుగుతున్న దేశాలకు ఇప్పుడు మరెన్నో ఆవిష్కరణలు కావాలి. దానికి బ్రాండ్‌ పేర్లు పెట్టి భారీగా ధర నిర్ణయించేకంటే.. చౌకగా ప్రజల అవసరాలు తీర్చే.. వినూత్న ఆవిష్కరణలు కావాలి. అప్పుడే మేకిన్‌ ఇండియాకు నిజమైన అర్థం దొరుకుతుంది.

చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో!

Advertisement
Advertisement