వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు గుడ్‌బై..చిక్కుల్లో ఉద్యోగులు!

9 Apr, 2022 14:11 IST|Sakshi

కరోనా ముందు కాలం వచ్చేసింది. కేసులు, మరణాలు,మాస్కులు, భౌతిక దూరాలు, శానిటైజర్లు వంటి వన్ని రోజూవారి జీవనం నుంచి తొలగి పోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2022వ సంత్సరం 2019 సంవత్సరంలా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగల్ని ఆఫీస్‌లకు ఆహ్వానిస్తున్నాయి. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు గుడ్‌ బై చెప్పి కార్యాలయాలకు తిరిగి వస్తున్న ఉద్యోగులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇన్ని రోజులు ఊర్లలో ఉన్న ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌కు రావడంతో..యజమానులు ఇంటి అద్దెల్ని భారీగా పెంచుతున్నారు. దీంతో ఉద్యోగులు సగం జీతాన్ని ఇంటి అద్దెకే చెల్లిస్తుండడంతో పడరాని పాట్లు పడుతున్నారు. 

మొదట కొన్ని రోజులు మాత్రమే అనుకున్న వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తరువాత కొన్ని నెలలకు చేరింది. ఏకంగా 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రెండేళ్ల తర్వాత దేశమంతా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ సంస్థలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. సంస్థల ఆదేశాలతో తిరిగి ఆఫీస్‌లకు వెళ్లేందుకు ఉద్యోగులు సొంత గ్రామాల నుంచి నగరానికి వస్తున్నారు. అలా రాజధాని ఐటీ ఏరియాల్లో నివసించే ఉద్యోగులకు ఇంటి అద్దె కట్టే విషయంలో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ముఖ్యంగా మణికొండ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ గచ్చిబౌలి ప్రాంతాల్లో యజమానులు ఇంటి రెంట్లను పెంచడంతో..సగం జీతం ఇంటి అద్దెకే వెళుతుందని వాపోతున్నారు. 

2019తో పోలిస్తే ఇంటి రెంట్లు 6నుంచి 8శాతం పెరిగింది. పలు నివేదిక ప్రకారం..ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఆరు,ఎనిమిది నెలల క్రితం 2బీహెచ్‌కే అద్దె రూ.25వేల నుంచి రూ.28వేలు' ఉండేది. కానీ ఇప్పుడు రూ.30 వేలు,రూ.32వేలకు పైగా ఉందని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.

గతేడాది నవంబర్‌ నెల గచ్చీబౌలీ ఏరియాలో ఇంటి అద్దె రూ.35వేలుంటే..ఈ ఏడాది మార్చి నెల సమయానికి రూ.45వేలకు చేరినట్లు హౌస్‌ రెంటల్‌ ఏజెన్సీలు చెబుతుండగా..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి కార్యాలయాలకు ఉద్యోగులు వస్తున్నారని, అందుకే యజమానులు ఇంటి రెంట్లను భారీగా పెంచుతున్నట్లు అనరాక్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

చదవండి: ప్రమోషన్లు వద్దంటున్న ఉద్యోగులు ! కారణం తెలిస్తే షాకవుతారు?

మరిన్ని వార్తలు