Beware of WhatsApp Valentines Day Special Scam - Sakshi
Sakshi News home page

వాలెంటైన్స్ డే లింకులతో లవ్ బర్డ్స్ జర జాగ్రత్త.. !

Published Tue, Feb 8 2022 7:03 PM

Beware of WhatsApp Valentines Day Special scam - Sakshi

ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజు పండుగ వాతావరణమే ఉంటుంది. అయితే వాలెంటైన్స్ డే రోజు ఇతర రోజుల కంటే మరింత ఆనందంగా ఉండాలనీ, ప్రియురాలు లేదా ప్రియుడు వారికి మరింత దగ్గరవ్వాలని, వారి బంధం మరింత స్ట్రాంగ్ అవ్వాలని ఒకరికొకరు తమ బందానికి గుర్తుగా బహుమతులను ఇచ్చుకుంటారు. తమ ప్రియురాలు/ప్రియుడు ఆకట్టుకోవడం కోసం ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చేందుకు సిద్ద పడుతుంటారు.

అయితే, మోసాగాళ్లు లవర్స్ అవసరాన్ని ఆసరా చేసుకొని వాట్సాప్ ద్వారా అమెజాన్‌ పేరుతో నకిలీ లింకులను పంపిస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు అమెజాన్‌ మీకు 15 వేల రూపాయలు విలువైన ఉత్పత్తులను అందిస్తుందని నకిలీ లింకులను కేటుగాళ్లు పంపిస్తున్నారు. అయితే, ఇలాంటి లింకుల నుంచి లవ్ బర్డ్స్ లేదా ఇతరులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెజాన్‌ ఎప్పుడు అలా వాట్సాప్ ద్వారా సందేశాలు పంపదు అని తెలుపుతున్నారు. ఏదైనా ఆఫర్ ప్రకటిస్తే, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేస్తుందని వారు పేర్కొంటున్నారు.

అయితే, ఇలాంటి నకిలీ లింకులను వినియోగదారులు సులభంగా గుర్తించవచ్చు అని సైబర్ నిపుణులు తెలియజేస్తున్నారు. పై సందేశంలో మనం గమనిస్తే, ఆ సందేశం అమెజాన్‌ పేరుతో వచ్చిన ఆ వెబ్‌సైటు పేరు మాత్రం వేరు పేరుతో ఉంది. ఇలా వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. ఒకవేల, ఎవరైనా ఆ లింకుల మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్, మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ వార్నింగ్ మెసేజ్ పంపుతాయని వారు అంటున్నారు.

(చదవండి: జియో యూజర్లకు రెండు రోజులు ఉచితంగా కాల్స్, డేటా!)

Advertisement
Advertisement