Sakshi News home page

Minu Margeret: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!

Published Fri, May 19 2023 4:41 PM

BlissClub Founder and CEO Minu Margeret success story and net worth telugu - Sakshi

Minu Margeret success story: సక్సెస్ సాధించడం అంటే మాటల్లో చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు. కఠోర శ్రమ, నిరంతర కృషి, అకుంఠిత దీక్ష చాలా అవసరం. ఇవన్నీ ఎవరైతే తు.చ తప్పకుండా పాటిస్తారో వారికి విజయం లభిస్తుంది. అలా కస్టపడి సక్సెస్ సాధించిన వారిలో ఒకరు 'మిను మార్గరెట్' (Minu Margeret). ఇంతకీ ఈమె సాధించిన సక్సెస్ ఏంటి? కంపెనీ టర్నోవర్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన మిను మార్గరెట్ బిజినెస్ ప్రారంభించడానికి ముందు విప్రో, గోల్డ్‌మేన్‌ శాక్స్‌ వంటి కంపెనీలలో పనిచేసింది. స్వతహాగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్న ఈమె ఉద్యోగం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపేది కాదు. ఈ కారణంగానే 2020లో బ్లిస్‌క్లబ్ (BlissClub) అనే కంపెనీని ప్రారంభించింది.

రెండు సార్లు ఫెయిల్యూర్..
ఈ బ్లిస్‌క్లబ్ సంస్థను ప్రారంభించడానికి ముందు ఈమె 'రెంట్ యువర్ వార్డ్‌రోబ్' పేరుతో అమెరికాకు చెందిన రెంట్ ది రన్‌వే సంస్థ స్ఫూర్తితో దుస్తులను అద్దెకు ఇచ్చే కంపెనీని ప్రారంభించింది. ఇది ఆశించినంత విజయం సాధించకపోవడంతో కొన్ని రోజులకే మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఆటోమేటెడ్ లాండ్రోమేట్ అనే బిజినెస్ స్టార్ట్ చేసి అది కూడా అతి తక్కువ కాలంలోనే నిలిపివేసింది. రెండు సార్లు అనుకున్న సక్సెస్ పొందకపోవడంతో ఏ మాత్రం నిరాశ చెందకుండా 2020లో బ్లిస్‌క్లబ్ ప్రారంభించి.. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే రూ. 18 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది.

(ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!)

మిను మార్గరెట్ బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీలో బి.కామ్ పూర్తి చేసి, ఆ తర్వాత యూకేలో చార్టర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ నుంచి CA చేసింది. ఆ తరువాత కాలంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నుంచి మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో మేజర్స్ పూర్తి చేసింది.

(ఇదీ చదవండి: చదివింది బీటెక్‌.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్)

ఎంబీఏ పూర్తి చేసిన తరువాత మహిళల కోసం యాక్టివ్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించాలని భావించింది. ఆమె కాలేజీ రోజుల్లోనే అల్టిమేట్ ఫ్రిస్బీ ఆడేది, కావున చురుకైన జీవనశైలి ఉన్న మహిళలు ఏమి కోరుకుంటున్నారో ఆమెకు బాగా తెలుసు. మహిళలకు అవసరమైన దుస్తులను దుస్తులను అందించడానికి ఈ కంపెనీ ప్రారంభించింది. ఈ కంపెనీ ఉన్నతికి చాలామంది సహకరించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి 2022 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ. 36 లక్షల నుంచి రూ. 15 కోట్లకు చేరింది.

కంపెనీ ప్రారంభించిన కేవలం 18 నెలలో రూ. 100 కోట్లు వార్షిక ఆదాయం గడించినట్లు సమాచారం. కంపెనీ ప్రస్తుతం 30 కంటే ఎక్కువ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలిసింది. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన రెండు ఆఫ్‌లైన్ స్టోర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆయితే బిజినెస్ ఎక్కువగా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా జరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Advertisement

What’s your opinion

Advertisement