Check These List Of Top Factors Before Planning To Buy Your First Home In Telugu - Sakshi
Sakshi News home page

ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఆగండాగండి.. ఇవి చెక్‌ చేశారా?

Published Fri, Aug 18 2023 4:50 PM

Check these factors for planning to buy your first home - Sakshi

సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కావున ఉద్యోగస్థులైనా, వ్యాపారస్తులైనా తప్పకుండా ఇల్లు కొనుగోలు లేదా నిర్మించుకోవడం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేసే వారు మాత్రం తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

👉ఇల్లు కొనటం అనేది కేవలం భావోద్వేగానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆర్థిక పరమైన అంశం కూడా. కావున ఇల్లు కొనేటప్పుడు ఎక్కడ కొనుగోలు చేస్తున్నాము, ధర ఎంత ఉంది అనే మరిన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. సొంత ఇల్లు భద్రతాభావం అందిస్తుంది.

👉కొత్త ఇల్లు కొనుగోలు చేయడంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే అది విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందని ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేస్తే, అవసరమైన సౌకర్యాలు లభించకపోగా.. రవాణా & ఇతర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

👉సాధారణంగా ఇంటికయ్యే ఖర్చులో 10 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ అవసరం. అయితే మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి హోమ్ లోన్ రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్‌లో ఇల్లు కొనుగోలు చేయడానికి అన్వేషించాలి.

👉ఇల్లు కొనుగోలు చేస్తే మాత్రం సరిపోదు.. దానికి కట్టుదిట్టమైన రిజిస్ట్రేషన్ వంటివి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు మీరు ఇల్లు కొనుగోలు చేసే డబ్బుతో పాటు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కొంత ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు.

👉బిల్డర్లు లేదా ప్రాపర్టీ డీలర్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కొనటానికి ముందే లాయర్​ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకోబోయే ప్రాపర్టీకి కో-ఓనర్ ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవాలి. అంతే కాకుండా తీసుకోబోయే ప్రాపర్టీ లిటిగేషన్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అన్ని సరిగ్గా ఉన్నాయన్న తరువాతే రిజిస్టర్ చేసుకోవాలి.

ఇవన్నీ చెక్‌ చేసుకున్న తర్వాత మీరు నిశ్చింతగా కొత్తింట్లో అడుగుపెట్టవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కావలసిన వివరాలు తెలుసుకోకుండా.. ఇల్లు కొంటే భవిష్యత్తులో ఏదైనా సమస్యలు తలెత్తవచ్చు. దీనిని వినియోగదారుడు గుర్తుంచుకోవాలి.

Advertisement
Advertisement