భారత్‌లో రూపాయికి సమానమైన డిజిటల్‌ కరెన్సీ, ఎప్పుడు విడుదలంటే!

8 Sep, 2022 11:33 IST|Sakshi

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ఈ ఏడాదే ‘పైలెట్‌ బేసిస్‌’తో ప్రారంభించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ టీ రబీ శంకర్‌ ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీల మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి సమయం, వ్యయం రెండూ తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

2022–23 కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయికి సమానమైన డిజిటల్‌ కరెన్సీని ఆర్‌బీఐ విడుదల చేస్తుందని చెప్పారు.

‘‘జీ–20, అలాగే బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్స్‌ (బీఐఎస్‌) వంటి సంస్థలతో ఇప్పుడు ఎదుర్కొంటున్న చెల్లింపుల సమస్యను పరిష్కరించడానికి సీబీడీసీ అంతర్జాతీయీకరణ చాలా కీలకమని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఇండియా ఐడియాస్‌ సమ్మిట్‌లో టీ రబీ శంకర్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు