గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు ఆదరణ | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు ఆదరణ

Published Fri, Jan 12 2024 4:52 AM

Gold ETFs shine bright in 2023 - Sakshi

న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)కు ఇన్వెస్టర్ల నుంచి చక్కని ఆదరణ లభించింది. 2023లో ఇన్వెస్టర్లు రూ.2,920 కోట్లను ఈ విభాగంలో ఇన్వెస్ట్‌ చేశారు. 2022లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే గతేడాది ఆరు రెట్లు పెరుగుదల కనిపిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల పెరుగుదల, అనిశి్చతుల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారం వైపు ఎక్కువ మంది మొగ్గు చూపించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022లో గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి రూ.459 కోట్లు రాగా, 2023లో రూ.2,920 కోట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా గతేడాది ఆగస్ట్‌ నెలలోనే రూ.1,028 కోట్లను గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. 16 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ‘‘భౌతిక బంగారం పట్ల భారతీయుల్లో మక్కువ వందల సంవత్సరాల నుంచి ఉంది.

దాంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మాదిరి పెట్టుబడి సాధనాలకు ఆమోదం తక్కువగా ఉండేది. కానీ, గడిచిన కొన్నేళ్లలో బంగారం డిజిటైజేషన్‌ పట్ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. సులభంగా ఇన్వెస్ట్‌ చేయడం, సౌకర్యంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు గోల్డ్‌ ఈటీఎఫ్‌ను ఆమోదించడానికి కారణం. ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో బంగారం తప్పకుండా ఉండాలి’’అని జెరోదా ఫండ్‌ హౌస్‌ సీఈవో విషాల్‌ జైన్‌ పేర్కొన్నారు.  

నిర్వహణ ఆస్తులు పైపైకి
బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది 27 శాతం పెరిగి రూ.27,336 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్‌ నాటికి ఈ మొత్తం రూ.21,445 కోట్లుగానే ఉండడం గమనించాలి. గత కొన్నేళ్లలో బంగారం అద్భుతమైన పనితీరు చూపించడాన్ని కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రేరణగా నిలిచింది. గతేడాది గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.73 లక్షలు అధికంగా ప్రారంభమయ్యాయి.

దీంతో మొత్తం ఫోలియోలు 49.11 లక్షలకు చేరాయి. 2023 మాత్రమే కాకుండా, 2020, 2021లోనూ బంగారం ఈటీఎఫ్‌లు మంచి రాబడులను ఇచ్చాయి. 2021లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.4,814 కోట్లు, 2020లో రూ.6,657 కోట్ల చొప్పున పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో బంగారం వ్యూహాత్మక సాధనంగా నిలుస్తుంది. చక్కని వైవిధ్యాన్ని ఇవ్వడంతోపాటు, ఆర్థిక పతనాలు, కఠిన మార్కెట్‌ పరిస్థితుల్లో నష్టాలను తగ్గిస్తుంది.

అందుకే దీనికి సురక్షిత సాధనంగా గుర్తింపు ఉంది’’అని మారి్నంగ్‌స్టార్‌ ఇండియా రిసెర్చ్‌ విభాగం చీఫ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది ఈక్విటీ మార్కెట్ల దిద్దుబాటు, ఆకర్షణీయమైన అవకాశాల నేపథ్యంలో ఏకంగా రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు స్టాక్స్‌ను వెతుక్కుంటూ వెళ్లాయి. అయినా కానీ, బంగారం ఈటీఎఫ్‌లు చెప్పుకోతగ్గ పెట్టుబడులను ఆకర్షించాయి. ఒక ఈటీఎఫ్‌ ఒక గ్రాము బంగారానికి సమానంగా స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్‌ అవుతుంటుంది. షేర్ల మాదిరే సులభంగా కొనుగోలు చేసి విక్రయించుకోవచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement