Sakshi News home page

కోట్ల సంపదను కాదని సన్యాసం పుచ్చుకున్న వజ్రాల వ్యాపారి ఫ్యామిలీ.. ఎందుకో తెలిస్తే..

Published Mon, Aug 21 2023 3:42 PM

Gujarat diamond merchant family become monks - Sakshi

అందరూ కస్టపడి సంపాదించి జీవితంలో కుబేరులు కావాలని, విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కంటూ ఉంటారు. అయితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ మాత్రం కోట్ల సంపదను వదిలి సన్యాసుల్లో కలిసిపోయారు. ఇంతకీ వారెవరు? ఎందుకిలా చేశారు? వారి సంపాదన ఎలా ఉండేదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

కొంతమంది ఆస్తులు లేకున్నా జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మరి కొంతమంది ఎన్ని ఆస్తులున్నా మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటారు. గుజరాత్ రాష్ట్రంలో ధనవంతులైన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య కోట్ల సంపదను.. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. ఈ వజ్రాల వ్యాపారి కుమార్తె ఇప్పటికే తన తొమ్మిదవ ఏటనే సన్యాస దీక్షను తీసుకుంది.

ఇదీ చదవండి: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ - అదేంటో తెలుసా?

ఇప్పుడు ఆమె తల్లి తండ్రులు కూడా సన్యాసులుగా మారారు. సంవత్సరానికి రూ. 15 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే ఫ్యామిలీ అన్ని వదిలి సన్యాసిగా మారడంతో ఎంతోమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. షా కుమారుడు భాగ్యరత్న అతని దీక్షా వేడుకకు ఫెరారీలో, అతని తల్లిదండ్రులు దీపేష్ & పికా అదే జాగ్వార్‌లో ప్రయాణించారు. తమ కుమార్తె ఇప్పటికే సన్యాసంలో కలిసిపోవడం వల్ల వీరు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. 

సన్యాసంలో చేరకముందే వారు అలాంటి జీవితం గడపాలని నిర్ణయించుకుని దీపేష్ షా 350 కిమీ, అతని భార్య పికా షా 500 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మా కుమార్తె సన్యాసంలో స్వీకరించినప్పుడే ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు దీపేష్ షా వెల్లడించారు. జీవితంలో ఎన్నెన్నో విజయాలను చూసాను, కానీ అంతిమంగా శాంతి, ఆనందం కోసం ఈ దీక్ష స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు?

దీపేష్ షా తండ్రి ప్రవీణ్ బెల్లం, చెక్కర వ్యాపారం చేసేవాడు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తోంది. అయినప్పటికీ భౌతిక సుఖాలు, విలాసాలు శాశ్వతం కాదని ఇప్పుడు జైన మతంలో సన్యాసులుగా చేరి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement