How To Become A Rich In Your Life; These Tips Will Help You Become Rich - Sakshi
Sakshi News home page

How To Become Rich: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!

Published Tue, Aug 1 2023 6:17 PM

How To Become a rich in your life these are the tips - Sakshi

ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, ధనవంతుడు కావాలని.. బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తరువాత ఇవన్నీ మనవల్ల అయ్యేపని కాదని మధ్యలోనే ఊరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు.. తప్పకుండా ధనవంతులవుతారు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.

స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం..
ధనవంతుడు కావాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఒక మంచి సులభమైన మార్గం స్టాక్ మార్కెట్ అనే చెప్పాలి. జీవితంలో డబ్బు పొదుపుచేయడం ఎంత ముఖ్యమో.. వాటిని ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇన్వెస్ట్‌మెంట్‌లో నష్టాలు వస్తాయని భావించవచ్చు, కానీ సరైన అవగాహన ఉంటే అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.

డైవర్సిఫికేషన్ చాలా అవసరం..
సంపాదించి కూడబెట్టిన డబ్బు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలి. అంటే మీదగ్గరున్న డబ్బు కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా.. గోల్డ్ లేదా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం వంటివాటిలో పెట్టుబడిగా పెట్టాలి. అప్పుడు ఒక రంగంలో నష్టం వచ్చినా.. మరో రంగంలో తప్పకుండా లాభం వస్తుంది. దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు.

అప్పులు చేయడం మానుకోవాలి..
సంపాదనకు తగిన ఖర్చులను మాత్రమే పెట్టుకోవాలి. విచ్చలవిడి ఖర్చులు చేస్తూ.. డబ్బు కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తే తరువాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుందనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.

ఇదీ చదవండి: నకిలీ మందులకు చెక్.. ఒక్క క్యూఆర్‌ కోడ్‌తో మెడిసిన్ డీటెయిల్స్!

గోల్ చాలా ముఖ్యం..
నువ్వు ధనవంతుడు కావాలంటే ముందుగా తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. ఫైనాన్సియల్ గోల్స్ పెట్టుకోవాలి. మీ ప్రయాణాన్ని గోల్ వైపు సాగిస్తే తప్పకుండా అనుకున్నది సాదిస్తావు. ఇల్లు, కారు ఇతరత్రా ఏమి కొనాలనుకున్న ముందుగా ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి

స్మార్ట్ ఇన్వెస్ట్ అవసరం..
ఇన్వెస్ట్ అంటే ఎదో ఒక రంగంలో గుడ్డిగా వెళ్లిపోవడం కాదు.. అలోచించి చాలా స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టాలి. ట్యాక్స్ సేవింగ్స్, ఫండ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. తక్కువ సమయంలో అధిక వడ్డీ వచ్చే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం మరచిపోకూడదు. యువకుడుగా ఉన్నప్పుడే రిస్క్ తీసుకోవాలి.. అప్పుడే సక్సెస్ పరుగెత్తుకుంటూ వస్తుంది.

ధనవంతుడు కావాలనే కోరిక ఉంటే సరిపోదు.. దాని కోసం అహర్నిశలు ఆలోచించాలి, ఆ మార్గంలోనే ప్రయాణం కొనసాగించాలి. తెలియని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి, వీలైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎక్కడ, ఎలా పెట్టుబడులు పెడుతున్నావో తెలియకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement