భారత్‌కు ఎలాంటి వృద్ధి అవసరమో చెప్పిన బిర్లా.. | India Deserves Double Engine Growth Where More Women Play An Important Role In The Economy - Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎలాంటి వృద్ధి అవసరమో చెప్పిన బిర్లా..

Published Fri, Jan 5 2024 7:33 AM

India Deserves Double Engine Growth - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మహిళలు కూడా కీలక పాత్ర పోషించే విధంగా భారత్‌కు ’డబుల్‌ ఇంజిన్‌’ వృద్ధి అవసరమని పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. మహిళలు సైతం ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా వృద్ధి కూడా వేగవంతం కాగలదని ఆయన పేర్కొన్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా శ్రామిక శక్తిలో మహిళల వాటా తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిర్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

బాంబే చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సొసైటీ (బీసీఏఎస్‌) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్‌ వేగవంతమైన వృద్ధి ముంగిట ఉందని, రాబోయే రోజుల్లో సూపర్‌పవర్‌గా ఎదుగుతుందని బిర్లా ధీమా వ్యక్తం చేశారు. వచ్చే దశాబ్ద కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతు భారత్‌ నుంచే ఉండనున్నారని ఆయన చెప్పారు.    

Advertisement
Advertisement