Lickable TV: ‘ఈ టీవీ తెరను నాకితే..’ ఇక్కడ జపానోడు ఏం కనిపెట్టాడో ఓ లుక్కేయండి

23 Dec, 2021 13:48 IST|Sakshi

Japan Licking TV Screen With Food Flavours: ‘జపానోడు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే’.. అంటూ ఓ అరవ డబ్బింగ్‌ సినిమాలో ఫన్నీ డైలాగ్‌ ఉంటుంది. అయితే అడ్వాన్స్‌ టెక్నాలజీని పుణికిపుచ్చుకున్న దేశంగా జపాన్‌.. క్వాలిటీ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. ఈ తరుణంలో జపాన్‌ నుంచి వచ్చిన ఓ తాజా ఆవిష్కరణపై సరదా చర్చ మొదలైంది.   


‘టేస్ట్‌ ద టీవీ’ TTTV పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించాడు ఓ జపాన్‌ ప్రొఫెసర్‌.  ప్రొటోటైప్‌ టీవీ తెరను డెవలప్‌ చేసి దీనిని తయారు చేశాడు. ఇందులో తెర మీద రకరకాల రుచులను చూసే వీలు ఉంటుంది. ప్రత్యేకమైన సెటప్‌ ద్వారా టేస్టీ ట్యూబ్‌లను అమర్చి ఉంటుంది. చూడడానికి ఇది పది ఫ్లేవర్‌ల రంగులరాట్నం మాదిరి ఉంటుంది. మల్టీపుల్‌ సెన్సార్‌తో పని చేసేలా రూపొందించాడు ఆ ప్రొఫెసర్‌. వాయిస్‌ కమాండ్‌ తీసుకోగానే(ఏ ఫ్లేవర్‌ కావాలో.. ఉదాహరణకు చాక్లెట్‌ ఫ్లేవర్‌ అని చెప్పాలి).. అప్పుడు  తెర మీద ఉన్న ప్లాస్టిక్‌ షీట్‌పై ఆ ఫ్లేవర్‌ వచ్చి పడుతుంది. అప్పుడు ఎంచక్కా నాకి రుచిచూసేయొచ్చు. 


  
ప్రొఫెసర్‌ హోమెయి మియాషిటా..  మెయిజి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ఇది తయారు చేయడానికి మియాషిటా ఆధ్వర్యంలోని 30 మంది విద్యార్థుల బృందం కష్టపడింది. ‘‘కరోనా టైంలో జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి కదా. అందుకే రెస్టారెంట్‌, వాళ్లకు నచ్చిన రుచి అనుభవం ఇంట్లోనే అందించేందుకు ఇలా ఫుడ్‌ ఫ్లేవర్‌లను అందించే డివైజ్‌ను రూపొందించాం’’ అని ప్రొఫెసర్‌ హోమెయి మియాషిటా చెప్తున్నారు.

Taste the TV  కమర్షియల్‌ వెర్షన్‌ను 875 డాలర్లకు అందించబోతున్నారు.  వీటితో పాటు టేస్టింగ్‌ గేమ్స్‌, క్విజ్‌లను కూడా రూపొందించబోతున్నారు. పిజ్జా, చాక్లెట్‌ రుచిని అందించే స్ప్రేను సైతం తయారు చేయనుంది ఈ టీం.

ఎక్స్‌క్యూజ్‌మీ.. కొంచెం మీ ముఖాన్ని అద్దెకిస్తారా?

మరిన్ని వార్తలు