Sakshi News home page

ఎడ్‌టెక్‌ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా..

Published Thu, Feb 8 2024 1:18 PM

NCLT Has Issued Notices To Bijus - Sakshi

ఫ్రాన్స్‌ కంపెనీ పిటీషన్‌ దాఖలు చేయడంతో బైజూస్‌ సంస్థ తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌టీ) నోటీసులు అందుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్‌ బిజినెస్ సర్వీసెస్‌ పిటీషన్ వేయడంతో బైజూస్‌కు  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌టీ) నోటీసులు ఇష్యూ చేసింది. 

బైజూస్‌ ఎడ్‌టెక్ కంపెనీ  రూ.4 కోట్లు అప్పు పడిందని, దాన్ని తిరిగి చెల్లించడం లేదని ఈ పిటీషన్‌లో టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ పేర్కొంది. నిబంధనల ప్రకారం నోటీసులపై  బైజూస్ రెండు వారాల్లో స్పందించాల్సి ఉంటుంది. 

ఇదిలా ఉండగా, టెలీపెర్ఫార్మెన్స్‌తోపాటు ఇతర కొన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలతో  2022 మధ్య వరకు బైజూస్ వ్యాపారం చేసింది. ఈ కంపెనీలు బైజూస్‌కు కాలింగ్ ఏజెంట్‌ల సేవలందించేవి. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా టెలీపెర్ఫార్మెన్స్‌, కోజెంట్ బైజూస్‌కు నిధులు నిలిపేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం!

వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్‌ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్‌లోన్‌-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్‌ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్‌.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. 

Advertisement

What’s your opinion

Advertisement