Sakshi News home page

పుంజుకుంటున్న ప్రముఖ కంపెనీ షేరు ధర.. కారణం ఇదే..

Published Mon, Feb 19 2024 3:24 PM

Paytm Has Shifted Its Nodal Account From PPBL To Axis Bank - Sakshi

పేటీఎం కంపెనీ షేరు ధర ఇటీవల భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయమే కారణమని నిపుణులు తెలిపారు. అయితే వరుసగా రెండో రోజు సోమవారం వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు (పేటీఎం) భారీగా పుంజుకుంది. బీఎస్‌ఈలో షేరుధర సోమవారం ఐదు శాతం పెరిగి రూ.358.55 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ను చేరింది. మర్చంట్‌ సెటిల్‌మెంట్ల కోసం యాక్సిస్‌ బ్యాంక్‌తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కంపెనీ షేర్లు లాభాల బాటపట్టాయి.

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తమ నోడల్‌ ఖాతాను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ నుంచి యాక్సిస్‌ బ్యాంకుకు మార్చింది. ఇందువల్ల పేటీఎం క్యూఆర్‌, సౌండ్‌బాక్స్‌, కార్డ్‌ మెషీన్‌ సేవలు మార్చి 15 తరవాత కూడా యథావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. 

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు - ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లు, ఎన్‌సీఎంసీల్లోకి డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని ఆదేశించింది. తాజాగా ఆ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఆర్‌బీఐ ఆంక్షల ప్రకటన తర్వాత కంపెనీ షేర్లలో పతనం కొనసాగుతూ వచ్చింది. యాక్సిస్‌ బ్యాంక్‌తో ఒప్పందం నేపథ్యంలో శుక్రవారం నుంచి కాస్త ఉపశమనం లభించింది. సోమవారం కూడా ఆ ర్యాలీ కొనసాగినట్లు తెలిసింది.

Advertisement

What’s your opinion

Advertisement