Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Fri, Mar 22 2024 9:10 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 21,954కు చేరింది. సెన్సెక్స్‌ 222 పాయింట్లు దిగజారి 72,403 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 85.71 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.32 శాతం, నాస్‌డాక్‌ 0.2 శాతం లాభపడ్డాయి.

గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి  ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్‌ సంకేతాలిచ్చారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

What’s your opinion

Advertisement