మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - ఒక్క రోజులోనే గిన్నిస్ రికార్డ్! | Sakshi
Sakshi News home page

Jimmy Donaldson: మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - మెటా థ్రెడ్స్‌లో యూట్యూబర్ హవా!

Published Fri, Jul 7 2023 5:01 PM

Threads App Reaches YouTuber MrBeast gets a Million Followers on Launch Day - Sakshi

Meta Threads: ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన మెటా థ్రెడ్స్ గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. విడుదలైన ఒక రోజుకే సంచలనం సృష్టించి ట్విటర్‌కు షాక్ ఇచ్చిన ఈ యాప్ ఏకంగా 1 మిలియన్ మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకున్న ఒక వ్యక్తి కొన్ని గంటల వ్యవధిలోనే 10 లక్షల ఫాలోవర్స్ సాధించిన సరి కొత్త రికార్డ్ నెలకొల్పాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ 'జిమ్మీ డోనాల్డ్‌సన్' (Jimmy Donaldson) మెటా థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ)

పాతిక సంవత్సరాల డోనాల్డ్‌సన్ 'మిస్టర్ బీస్ట్' అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాడు. తాజాగా విడుదలైన థ్రెడ్స్ యాప్‌లో కూడా తన హవా చూపించాడు. ఇతడు మెటా థ్రెడ్స్‌లో కేవలం మూడు పోస్టులు మాత్రమే చేసినట్లు సమాచారం. ఈ మూడు పోస్టులకు 1 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారంటే ఇతడెంత ఫెమస్ అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఫాలోవర్స్ పెరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తీసి ట్విటర్ ద్వారా పోస్ట్ చేసాడు.

Advertisement
Advertisement