Sakshi News home page

64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే?

Published Thu, Aug 31 2023 12:41 PM

Youtube removed million videos community norm violation - Sakshi

ఆధునిక కాలంలో యూట్యూబ్ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. దీని ద్వారా ఎంతోమంది బాగా సంపాదిస్తున్నారు. అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల ఏకంగా ఇండియాలో 19 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 2023 జనవరి నుంచి మార్చి వరకు సుమారు 1.9 మిలియన్లకంటే ఎక్కువ వీడియోలను తొలగించినట్లు తెలిసింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 6.48 మిలియన్ల (64 లక్షల కంటే ఎక్కువ) వీడియోలను తీసివేసింది.

ఇదీ చదవండి: ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు అండ్ యూట్యూబ్ పాలసీలను ఎలా అమలు చేస్తుంది అనే దానిపై గ్లోబల్ డేటాను విడుదల చేసింది. ఇందులో తొలగించిన వీడియోల వివరాలు వెల్లడించింది. ఒక్క భారతదేశంలో (1.9 మిలియన్స్) మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ తీసివేసింది. అగ్రరాజ్యమైన అమెరికాలో  654968, రష్యాలో 491933, బ్రెజిల్‌లో 449759 వీడియోలను తొలగించినట్లు సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement