Shameerpet Gun Fire: Manoj Smitha Traps Ladies Lures Acting Chances - Sakshi
Sakshi News home page

శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్‌, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్‌..

Published Sat, Jul 15 2023 4:45 PM

Shameerpet Gun Fire: Manoj Smitha Traps Ladies Lures Acting Chances - Sakshi

క్రైమ్‌: శామీర్‌పేట కాల్పుల ఘటన కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మరో కొత్త విషయం తెలిసింది. మనోజ్‌, స్మితా గ్రంథిలు కలిసి పలు మోసాలకు పాల్పడ్డారు. యాక్టింగ్‌ పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్‌ చేశారు.  స్మిత ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్‌ చేయగా.. ఇద్దరూ కలిసి సదరు యువతి నుంచి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ఒరాకిల్‌లో పని చేస్తూనే.. స్మిత మోసాలకు దిగింది. మనోజ్‌తో కలిసి బంజారాహిల్స్‌లో డెన్‌ ఏర్పాటు చేసింది. షాకన్‌యోరా సొల్యూషన్స్‌ పేరిట షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశారు.  నిత్యం పార్టీలతో వీళ్లిద్దరూ బిజీ బిజీగా గడిపేవారు. అక్కడి నుంచి తారసపడిన అందమైన అమ్మాయిలకు అవకాశాల పేరిట వల వేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పలు ఘటన తర్వాత వీళ్ల మోసాలు వెలుగు చూశాయి. దీంతో.. వీళిద్దరి అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా బాధితుల్లో ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. 

మనోజ్‌ తండ్రి హల్‌ చల్‌
మనోజ్‌-స్మితల నడుమ వివాహేతర సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలపై మనోజ్‌ తండ్రి మీడియాతో దురుసుగా స్పందించారు. అలాంటిదేం లేదని.. స్మితా గ్రంధి కేవలం ఎంప్లాయి మాత్రమేనని అంటున్నాడు. ఒకేచోట.. ఇద్దరూ సన్నిహితంగా ఉ‍న్నంత మాత్రానా సంబంధం అంటగట్టడం సరికాదని.. పైగా స్మిత మనోజ్‌ కంటే వయసులో పెద్దదని  ఆయన అంటున్నాడు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేసి తీరతామని అంటున్నాడాయన. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ వద్ద హల్‌ చల్‌ చేశాడాయన.

జరిగిన కథ..
శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్‌ భార్యతో మనోజ్‌ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్‌ దాస్‌తో విడిపోయిన శ్వేతతో మనోజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం స్మిత కూకట్‌పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్‌ కూడా స్మిత తెచ్చుకుంది. 

మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. జులై 12న స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని మనోజ్ కొట్టాడు. దీంతో ఆ బాలుడు అల్వాల్ సీడబ్ల్యుూసీలో ఫిర్యాదు చేశాడు. దీంతో 17 ఏళ్ల బాలుడిని సీడబ్ల్యూసీ తమ సంరక్షణలో ఉంచుకుంది. తనతో పాటు తన చెల్లెలును కూడా మనోజ్ వేధిస్తున్నారని సీడబ్ల్యుసీకి స్మిత కుమారుడు ఫిర్యాదు చేశాడు.  దీంతో జులై 18న తమ ముందు పాపతో పాటు హాజరుకావాలని స్మితకు సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేసింది. అలాగే.. 

మనోజ్ చిత్రహింసల గురించి తండ్రి సిద్ధార్థ్‌కు కుమారుడు చెప్పాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్‌ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు.

సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ గన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గన్‌లో మంద గుండు సామాగ్రి ఉందా అన్నది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ గన్‌ను పంపించారు.

ఇదీ చదవండి: పతీ.. పత్నీ ఔర్‌ వో.. హైప్రొఫైల్‌ స్టోరీ ఇది

Advertisement
Advertisement